← Back to స · Booklets 51–60 (digitized file 6)

సూర్యః sūryaḥ

Original — తెలుగు
  1. సువతి ప్రేరయతి జనాన్ కరంఅణి ఇతి సూర్యః సుష్టు ఈరయతి ప్రేరయతి ఇతివా సూర్యః, పరమాత్మా ప్రేరణ సౌష్టవంచ నిరుపాధికత్వం -

(శాస్త్రములో చేయవలసినవి అని చెప్పబడిన కర్మల యందు ప్రాణులను వారి వారి యోగ్యతల ననుసరించి ప్రేరేపించువాడు).

  1. సుష్టు కర్మసు ప్రాణినః ఈరయతి ఇతి సూర్యః -

(ప్రాణులను వారి వారి కర్మలందు ప్రేరేపించువాడు).

  1. సుష్టు యజ్ఞదాన తపః ప్రభృతి కర్మసు తత్తర్భోక్తృతయా తత్తత్కర్తృభిః ఊర్యః - ఊరీ కార్యః ఇతి సూర్యః -

(యజ్ఞము, దానము, తపస్సు మొదలగు కర్మలందు వాటి భోక్త తానే యగుటవలన ఆ కర్మ కర్తలచేత ఆరాధింపబడువాడు).

సు + ఊర్యః = సూర్యః - ‘స’ అనగా సుష్టు - బాగుగా యని యర్థము - యజ్ఞాది కర్తలచేత ఆ యజ్ఞభోక్తగా ఆరాధింపబడువాడు -

  1. “సూతే శ్రియమితి సూర్యః - అగ్నిర్వా” (శ్రీశంకరః)

(సంపద నిచ్చువాడు, లేక అగ్ని, సిరిని శోభను కలిగించువాడు)

  1. సర్వదః కర్మ ప్రేరకః -

(అన్నింటిని కలుగచేయువాడు - ప్రాణులను కర్మలందు ప్రేరేపించువాడు - సంపద నొసగువాడు. తన కిరణములచేత చైతన్యము కలిగించు శక్తి (Energy) నిచ్చువాడు).

  1. రశ్మీనాం ప్రాణానాం రసనాంచ స్వీకరణాత్ సూర్యః -

(కిరణములను, ప్రాణులను, రసములను (జలములను) ఆకర్షించువాడు - స్వీకరించువాడు).

  1. స్వభక్త బుద్ధీనాం సుష్టు ప్రేరకః - (శ్రీకూరనారాయణః)

(తన భక్తుల బుద్ధులను బాగుగ ప్రరేపించువాడు).

  1. సర్వ ప్రాణి సూతి హేతుత్వాత్ పరమాత్మనః సూర్యత్వం -

(సమస్త ప్రాణుల పుట్టుటకు కారణమైనవాడు గాన పరమాత్మ సూర్యుడు అని చెప్పబడుచున్నాడు).

  1. సువీర్య సంపన్నః - విశ్వ ప్రేరకః -

(ప్రపంచమునంతను ప్రేరేపించువాడు కనుక గొప్ప చైతన్యశక్తి గలవాడు).

  1. హిరణ్యయే న పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం |

తత్వం పూషన్న పావృణు సత్యధర్మాయ దృష్టయే ||. (ఈశావాస్యోపనిషత్)

(సత్పదార్థమైన భగవంతుని ముఖము - సూర్యుని తేజస్సు అను బంగారపు మూతచే కప్పబడినది. సూర్యునిలోన భగవచ్ఛక్తి యున్నది - ఓ సూర్యభగవానుడా ఆ మూతను తీసివేసిన నేను భగవంతుని దర్శించెదను).

  1. “కాలాత్ముండును నీశ్వరుండునునైన సూర్యుండు గ్రహనక్షత్రతారా చక్రస్థుండై పరమాణ్వాది సంవత్సరాత్మకంబైన కాలంబునం జేసి ద్వాదశరాశ్యాత్మకంబైన జగంబున సౌర బార్హస్పత్య సావనా చాంద్ర నాక్షత్రమాన భేదంబులం గానబడుచున్న వాడై సంవత్సర పరీవత్స రేడావత్సరాను వత్సిర వత్సిర నామంబుల సృజ్యంబైన బీజాంకురంబుల శక్తిం గాల రూపంబైన స్వశక్తి చేత నభిముఖంబుగా చేయుచు బురుషులకు నాయురాది వ్యయంబులం జేసి విషయాసక్తి నివర్తింపం జేయుచుం గోరికలు గలవారికి యజ్ఞముఖంబులం జేసి గుణమయంబులైన స్వర్గాది ఫలంబుల విస్తరింపచేయుచు గగనంబున బరువు పెట్టు వత్సర పంచక ప్రవర్త కుండగు మార్తాండునకు బూజ గావింపుము” - (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 11 -
  2. “యేన సూర్యస్త పతి”

(దేనివలన సూర్యుడు తాపము - వేడిమి, శక్తి - కలుగచేయుచున్నాడో - అది భగవంతుడే) (భగవంతుడు సూర్య గోళములో తేజోరూపములోనుండి అతని ద్వారా ప్రపంచమునకు వేడిమిని - శక్తిని, చైతన్య శక్తిని - కలుగ చేయుచున్నాడు).

  1. “యదాదిత్యగతం తేజః జగద్భాసయతే (అ)ఖిలం” |

యచ్ఛంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధిమామకం ||

(సూర్యుడు, చంద్రుడు, అగ్ని - వీటియందుగల తేజస్సు నాదే - భగవంతునిదే - యని తెలుసుకొనుము -). (భగవంతుడు తేజో రూపుడు - అతని తేజస్సు సూర్యునిలో నున్నందుననే సూర్యుడు దానితో ప్రకాశిస్తున్నాడు ప్రకాశరూపములైన నక్షత్రముము మొదలగునవి అన్నియు ఇట్లే ప్రకాశించుచున్నవి).

  1. “ప్రభాస్మి శశి సూర్య యోః -” (శ్రీమద్భగవద్గీత - 7 - 8)

(సూర్య చంద్రులప్రభ - కాంతి, వేడిమి, తేజస్సు, చైతన్య శక్తి నేనే అయి యున్నాను (Heat can be converted into Energy and light.) (భగవంతుడు చిద్ఘనం).

  1. “జ్యోతిషామపి తజ్జోతిః” (శ్రీమద్భగవద్గీత - 13 - 17)

(తేజోమూర్తులయిన - జ్యోతిస్స్వరూపములైన - సూర్యుడు, నక్షత్రములు మొదలగువాటిలోనుండు తేజస్సు భగవంతునిదే - (భగవంతుడు స్వయంజ్యోతి - తనంతట తానే ప్రకాశించువాడు - అట్లు ప్రకాశించుటకు ఇతర వస్తువులమీద ఆధారపడియుండనవసరము లేదు - మిగిలిన జ్యోతి స్వరూపములు వాటి జ్యోతిస్సునకు భగవంతునిమీద ఆధారపడియున్నవి).

  1. “విశ్వరూపం - జ్యోతిరేకం తపంతం సహస్రరశ్మిభిః శతథా వర్తమానః ప్రాణః ప్రజానా ముదయత్యేష సూర్యః” (ఋక్కు)

(ఒకే జ్యోతిస్వరూపమైనదిన్నీ, వేలకొలది కిరణములచే నూరు విధములుగ ప్రవర్తించు ప్రాణము ప్రజలను పుట్టించుచున్నది.ఇదియే సూర్యుడు).

  1. “ఇంద్రం మిత్రం వరుణ మగ్ని మాహురధో దివ్య సువర్ణో గరుత్మాన్ |

ఏకం సద్విప్రా బహుధావదుం త్యగ్నిం యమం మాతరిశ్వాన మాహుః ||” ఇతి శ్రుతిః

(శ్రుతిలో సూర్యుడు పై విధముగా చెప్పబడుచున్నాడు)

  1. “సూర్యోజలం, మహీ, వాయుర్వహ్నిరాకాశ మేవచ |

మాయా జాకశ్చ సోమశ్చ - రుద్రాదీనాంతు మూర్తయః ||“.

(పైన చెప్పినవి శివుని అష్టమూర్తులు - వాటిలో సూర్యుడు ఒకటి).

  1. అగ్నౌ ప్రాప్తాహుతి స్సమ్యగాదిత్య ముపతిష్ఠతే |

ఆదిత్యా జ్జాయతే వృష్టిః వృష్టేరన్నం తతః ప్రజాః || ఇతి శ్రుతిః.

(సూర్యుడు యజ్ఞస్వరూపుడు కనుక అగ్నిలో చేయబడినది సూర్యునిచేరి అందులో లీనమగును. సూర్యుని వలన వర్షము కలుగును - వర్షము పడుటవలన అన్నము (సస్యము) కలుగును - అన్నమువలన ప్రజకు పుట్టుచున్నారు).

Transliteration
  1. suvati prērayati janān karaṃaṇi iti sūryaḥ suṣṭu īrayati prērayati itivā sūryaḥ, paramātmā prēraṇa sauṣṭavaṃca nirupādhikatvaṃ -

(śāstramulō cēyavalasinavi ani ceppabaḍina karmala yaṃdu prāṇulanu vāri vāri yōgyatala nanusariṃci prērēpiṃcuvāḍu).

  1. suṣṭu karmasu prāṇinaḥ īrayati iti sūryaḥ -

(prāṇulanu vāri vāri karmalaṃdu prērēpiṃcuvāḍu).

  1. suṣṭu yajñadāna tapaḥ prabhṛti karmasu tattarbhōktṛtayā tattatkartṛbhiḥ ūryaḥ - ūrī kāryaḥ iti sūryaḥ -

(yajñamu, dānamu, tapassu modalagu karmalaṃdu vāṭi bhōkta tānē yaguṭavalana ā karma kartalacēta ārādhiṃpabaḍuvāḍu).

su + ūryaḥ = sūryaḥ - ‘sa’ anagā suṣṭu - bāgugā yani yarthamu - yajñādi kartalacēta ā yajñabhōktagā ārādhiṃpabaḍuvāḍu -

  1. “sūtē śriyamiti sūryaḥ - agnirvā” (śrīśaṃkaraḥ)

(saṃpada niccuvāḍu, lēka agni, sirini śōbhanu kaligiṃcuvāḍu)

  1. sarvadaḥ karma prērakaḥ -

(anniṃṭini kalugacēyuvāḍu - prāṇulanu karmalaṃdu prērēpiṃcuvāḍu - saṃpada nosaguvāḍu. tana kiraṇamulacēta caitanyamu kaligiṃcu śakti (Energy) niccuvāḍu).

  1. raśmīnāṃ prāṇānāṃ rasanāṃca svīkaraṇāt sūryaḥ -

(kiraṇamulanu, prāṇulanu, rasamulanu (jalamulanu) ākarṣiṃcuvāḍu - svīkariṃcuvāḍu).

  1. svabhakta buddhīnāṃ suṣṭu prērakaḥ - (śrīkūranārāyaṇaḥ)

(tana bhaktula buddhulanu bāguga prarēpiṃcuvāḍu).

  1. sarva prāṇi sūti hētutvāt paramātmanaḥ sūryatvaṃ -

(samasta prāṇula puṭṭuṭaku kāraṇamainavāḍu gāna paramātma sūryuḍu ani ceppabaḍucunnāḍu).

  1. suvīrya saṃpannaḥ - viśva prērakaḥ -

(prapaṃcamunaṃtanu prērēpiṃcuvāḍu kanuka goppa caitanyaśakti galavāḍu).

  1. hiraṇyayē na pātrēṇa satyasyāpi hitaṃ mukhaṃ |

tatvaṃ pūṣanna pāvṛṇu satyadharmāya dṛṣṭayē ||. (īśāvāsyōpaniṣat)

(satpadārthamaina bhagavaṃtuni mukhamu - sūryuni tējassu anu baṃgārapu mūtacē kappabaḍinadi. sūryunilōna bhagavacchakti yunnadi - ō sūryabhagavānuḍā ā mūtanu tīsivēsina nēnu bhagavaṃtuni darśiṃcedanu).

  1. “kālātmuṃḍunu nīśvaruṃḍununaina sūryuṃḍu grahanakṣatratārā cakrasthuṃḍai paramāṇvādi saṃvatsarātmakaṃbaina kālaṃbunaṃ jēsi dvādaśarāśyātmakaṃbaina jagaṃbuna saura bārhaspatya sāvanā cāṃdra nākṣatramāna bhēdaṃbulaṃ gānabaḍucunna vāḍai saṃvatsara parīvatsa rēḍāvatsarānu vatsira vatsira nāmaṃbula sṛjyaṃbaina bījāṃkuraṃbula śaktiṃ gāla rūpaṃbaina svaśakti cēta nabhimukhaṃbugā cēyucu buruṣulaku nāyurādi vyayaṃbulaṃ jēsi viṣayāsakti nivartiṃpaṃ jēyucuṃ gōrikalu galavāriki yajñamukhaṃbulaṃ jēsi guṇamayaṃbulaina svargādi phalaṃbula vistariṃpacēyucu gaganaṃbuna baruvu peṭṭu vatsara paṃcaka pravarta kuṃḍagu mārtāṃḍunaku būja gāviṃpumu” - (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 11 -
  2. “yēna sūryasta pati”

(dēnivalana sūryuḍu tāpamu - vēḍimi, śakti - kalugacēyucunnāḍō - adi bhagavaṃtuḍē) (bhagavaṃtuḍu sūrya gōḷamulō tējōrūpamulōnuṃḍi atani dvārā prapaṃcamunaku vēḍimini - śaktini, caitanya śaktini - kaluga cēyucunnāḍu).

  1. “yadādityagataṃ tējaḥ jagadbhāsayatē (a)khilaṃ” |

yacchaṃdramasi yaccāgnau tattējō viddhimāmakaṃ ||

(sūryuḍu, caṃdruḍu, agni - vīṭiyaṃdugala tējassu nādē - bhagavaṃtunidē - yani telusukonumu -). (bhagavaṃtuḍu tējō rūpuḍu - atani tējassu sūryunilō nunnaṃdunanē sūryuḍu dānitō prakāśistunnāḍu prakāśarūpamulaina nakṣatramumu modalagunavi anniyu iṭlē prakāśiṃcucunnavi).

  1. “prabhāsmi śaśi sūrya yōḥ -” (śrīmadbhagavadgīta - 7 - 8)

(sūrya caṃdrulaprabha - kāṃti, vēḍimi, tējassu, caitanya śakti nēnē ayi yunnānu (Heat can be converted into Energy and light.) (bhagavaṃtuḍu cidghanaṃ).

  1. “jyōtiṣāmapi tajjōtiḥ” (śrīmadbhagavadgīta - 13 - 17)

(tējōmūrtulayina - jyōtissvarūpamulaina - sūryuḍu, nakṣatramulu modalaguvāṭilōnuṃḍu tējassu bhagavaṃtunidē - (bhagavaṃtuḍu svayaṃjyōti - tanaṃtaṭa tānē prakāśiṃcuvāḍu - aṭlu prakāśiṃcuṭaku itara vastuvulamīda ādhārapaḍiyuṃḍanavasaramu lēdu - migilina jyōti svarūpamulu vāṭi jyōtissunaku bhagavaṃtunimīda ādhārapaḍiyunnavi).

  1. “viśvarūpaṃ - jyōtirēkaṃ tapaṃtaṃ sahasraraśmibhiḥ śatathā vartamānaḥ prāṇaḥ prajānā mudayatyēṣa sūryaḥ” (ṛkku)

(okē jyōtisvarūpamainadinnī, vēlakoladi kiraṇamulacē nūru vidhamuluga pravartiṃcu prāṇamu prajalanu puṭṭiṃcucunnadi.idiyē sūryuḍu).

  1. “iṃdraṃ mitraṃ varuṇa magni māhuradhō divya suvarṇō garutmān |

ēkaṃ sadviprā bahudhāvaduṃ tyagniṃ yamaṃ mātariśvāna māhuḥ ||” iti śrutiḥ

(śrutilō sūryuḍu pai vidhamugā ceppabaḍucunnāḍu)

  1. “sūryōjalaṃ, mahī, vāyurvahnirākāśa mēvaca |

māyā jākaśca sōmaśca - rudrādīnāṃtu mūrtayaḥ ||“.

(paina ceppinavi śivuni aṣṭamūrtulu - vāṭilō sūryuḍu okaṭi).

  1. agnau prāptāhuti ssamyagāditya mupatiṣṭhatē |

ādityā jjāyatē vṛṣṭiḥ vṛṣṭērannaṃ tataḥ prajāḥ || iti śrutiḥ.

(sūryuḍu yajñasvarūpuḍu kanuka agnilō cēyabaḍinadi sūryunicēri aṃdulō līnamagunu. sūryuni valana varṣamu kalugunu - varṣamu paḍuṭavalana annamu (sasyamu) kalugunu - annamuvalana prajaku puṭṭucunnāru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.