మిక్కిలి చిన్నది; అణువు, అణువు కన్న చిన్నది, అధ్యాత్మము, అతి సూక్ష్మము - సూక్ష్మాతి సూక్ష్మము -
సూక్ష్మ భూతాకాకాశేదే రపి కారణత్వాత్ శబ్దాది గుణా భావాచ్ఛ, సు సూక్ష్మం -
(సూక్ష్మములైన ఆకాశము మొదలగువాటికి కూడా కారణమగుటవలన శబ్దాది గుణములు లేకుండుటవలన మిక్కిలి చిన్నది).
(పంచీకృతమైనవి, పంచీకృతము కానివి అయిన శబ్దము, స్పర్శము మొదలగు వాటి కంటె విరళము అగుటచేత మిక్కిలి చిన్నదైనది యని చెప్పబడినది).
(శ్రీశంకరః)
(శబ్దము మొదలగు వాటివలె స్థూలము కాక - వాటి వలె తనకు కారణ వస్తువు లేనందున మిక్కిలి సూక్ష్మమైనది - ఆకాశము మొదలగునవి స్థూలరూపములగుటవలన వాటికి శబ్దము మొదలగునవి కారణములుగ నున్నవి. అట్లు కారణవస్తువు లేనందున - ఇది - ఆత్మ అతి సూక్ష్మము - మిక్కిలి సూక్ష్మమైనది).
(మిక్కిలి సూక్ష్మమైన వస్తువు కనబడుట కష్టము - ఈ ఆత్మ కనబడకపోవుట దూరముగానున్నందున కాదు, కాని మిక్కిలి చిన్నదగుటవలననే).
mikkili cinnadi; aṇuvu, aṇuvu kanna cinnadi, adhyātmamu, ati sūkṣmamu - sūkṣmāti sūkṣmamu -
sūkṣma bhūtākākāśēdē rapi kāraṇatvāt śabdādi guṇā bhāvāccha, su sūkṣmaṃ -
(sūkṣmamulaina ākāśamu modalaguvāṭiki kūḍā kāraṇamaguṭavalana śabdādi guṇamulu lēkuṃḍuṭavalana mikkili cinnadi).
(paṃcīkṛtamainavi, paṃcīkṛtamu kānivi ayina śabdamu, sparśamu modalagu vāṭi kaṃṭe viraḷamu aguṭacēta mikkili cinnadainadi yani ceppabaḍinadi).
(śrīśaṃkaraḥ)
(śabdamu modalagu vāṭivale sthūlamu kāka - vāṭi vale tanaku kāraṇa vastuvu lēnaṃduna mikkili sūkṣmamainadi - ākāśamu modalagunavi sthūlarūpamulaguṭavalana vāṭiki śabdamu modalagunavi kāraṇamuluga nunnavi. aṭlu kāraṇavastuvu lēnaṃduna - idi - ātma ati sūkṣmamu - mikkili sūkṣmamainadi).
(mikkili sūkṣmamaina vastuvu kanabaḍuṭa kaṣṭamu - ī ātma kanabaḍakapōvuṭa dūramugānunnaṃduna kādu, kāni mikkili cinnadaguṭavalananē).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.