← Back to స · Booklets 51–60 (digitized file 6)

సుషుమ్నా suṣumnā

Original — తెలుగు
  1. “దేహే తు దక్షిణే భాగే వీణా దండ దేహభృత్ |

దీర్ఘాస్థి మూర్థ పర్యంతం బ్రహ్మ దండేతి కథ్యతే |

తస్యాంతే సుషిరం సూక్ష్మం బ్రహ్మనాడీతి సూరిభిః |

ఇడా పింగళయో ర్మధ్యే సుషుమ్నా సూక్ష్మరూపిణీ ||“.

దేహము వెనుకభాగములో దేహమును నిలబెట్టియుంచు వీణాదండమను పెద్ద ఎముక - వెన్నెముక - ఉన్నది (Back bone). అది శిరస్సువరకు గలదు. దానినే బ్రహ్మదండి యందురు - దాని లోపల ఇడా పింగళానాడుల మధ్య సూక్ష్మ రూపములో సుషుమ్నా యను పేరుగల సూక్ష్మనాడి కలదు - దానిని బ్రహ్మనాడి యని సూరిజనులు చెప్పుదురు -

  1. “సుషుమ్నానాడీ మేరుదండే పృష్టస్య వంశే స్థితా |మూలాధారమారభ్య పృష్ట వంశమార్గేణ బ్రహ్మరంధ్ర పర్యంతం గతా. తస్యా వామే ఇడా దక్షిణే పింగళా అస్తి, సుషుమ్న మూల దేశే చిత్రానాడీ అస్తి. తస్య మధ్యే (అంతరే) హరాత్మా బిందు నాదకం ఆత్మా మిత్యాహకార రేఫ ఈకార బిందునాదాత్మకం అస్తి”.

(శరీరములోని వెన్నెముక మేరు దండి అని చెప్పబడుచున్నది. దాని వెనుక అంచున ఈ సుషుమ్న ఉన్నది - ఇది మూలాధారము మొదలుకొని బ్రహ్మ దండి ద్వారా శిరస్సులోనున్న బ్రహ్మరంధ్రమువరకు వ్యాపించియున్నది. దాని ఎడమ ప్రక్క ఇడానాడియు, కుడిప్రక్క పింగళానాడి యున్నవి. ఈ సుషుమ్న యొక్క మూలమందు చిత్రానాడి యున్నది - దానిలో బ్రహ్మ రూపమైన నాదబిందువులున్నవి).

  1. “బ్రహ్మలోక ప్రాప్తి ద్వారంబగుట సుషుమ్న బ్రహ్మనాడి యనంబరగు” (శ్రీనాధుడు - కాశీఖండము).

  2. గర్భస్థ జంతు శరీరమందు బ్రహ్మ రంధ్రముద్వారా ఆత్మ ప్రవేశించి సకల తత్వములకును చేతనత్వము కలుగచేయును - ఇది బ్రహ్మరంధ్రాధో భాగమందు శుక్ల వర్ణముగల ఒకానొక మృజ పదార్థమునాశ్రయించి ప్రకాశించుచున్న తేజోరూపము - ఇది సుధాస్థానముగానున్నందున చంద్రమండలమని యాగమ వేత్తలు చెప్పుచున్నారు -

“ఆ ప్రవేశించిన ఆత్మయందు గల విమర్శ శక్తి, అనగా చిన్మండల తేజఃపుంజము బ్రహ్మరంధ్రమునుంచి అధో ముఖముగా విద్యుల్లతవలె బయలుదేరి మూలాధారమును పొంది స్వాధిష్ఠానము స్థానముగా నున్నది, దీనిని సుషుమ్నా నాడి యనియు, జీవనాడి, బ్రహ్మ నాడి యని యాగమ వేత్తలు చెప్పుదురు - ఇది అగ్నిస్వరూపము.”

ఇటుల చంద్రాగ్ను లేర్పడినవి. ఈ బ్రహ్మనాడీమార్గమందున్న సంకేతములు మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా, సహస్రారములు అని సప్తకమలములు గలవు. వీని స్థానములు పాయు, ఉపస్థ,నాభి, హృదయ, భ్రూమధ్య బ్రహ్మ రంధ్రములు - సుషుమ్న యీ కమలములను సృజించుచు పుష్పమాలయందు సూత్రమువలె నుండిస్వాధిష్ఠానాది దీప్తిని సహస్రారమునకు వేధించుచు, అందువలన కలిగిన అమృత ధారా ప్రవాహమువలన 72 నాడీ సముదాయమునకు తృప్తిని కలుగ చేయుచు నుండును - ఆ అగ్నియొక్క ఉష్ణాధిక్యము అమృతవృష్టివలన శమించును - ఈ వృష్టివలన కలిగిన శీతాధిక్యము ఈ అగ్నివలన శాంతించును - గాన సమ శీతోష్ణములు ప్రాణులకు సుఖము కలుగుచుండును -

ఈ నాడి మధ్య మధ్యను కమలములందు మాతృకా రూపముగా ప్రదక్షిణ రూపముగా పైకి వ్యాపించినందున కౌళులు కుండలిని యొక్క ఆకారముగా నున్నందున దీనిని కుండలినీ శక్తి యని వాడుదురు -

“ఈ నాడియందు పరమాత్మ తేజస్సు జీవ సంజ్ఞను పొందియున్నందున బ్రహ్మనాడి యనియు, సరస్వతి రూపమైన అకారాది హకారాంతమైన పంచాశద్వర్ణమయమగు మాతృక యీ నాడీ రూపముగా విశుద్ధాది ఆజ్ఞాంతకమల రూపమును పొంది ఆయా దళములందున్నందున పరానాడి యనియు, వేదాది సకల విద్యలు, సకల మంత్రములు, సకల వాగ్రూప వ్యవహారమునకు నిది కారణముగా నున్నందున బ్రహ్మనాడి యనియు వేదమందు వాడబడుచున్నది”.

  1. మూలాధారము మొదలుకొని శిరస్సు వరకు ఒక సూక్ష్మ నాడి యున్నది. అదియే సుషుమ్న. అది శిరస్సునుండి హృదయమునకు తిరుగ వ్రేలాడుచున్నది. వ్రేలాడు భాగమునకు అమృతనాడి (left vagus) యని పేరు. ఈ నాడి అంతయు ఒక్కటియే అయినను వెనుకకు కొంతభాగము (సుషుమ్న), ముందునకు కొంతభాగము (అమృత) ఉన్నందున రెండు సాధనమార్గములు కలది అని కొందరందురు. సుషుమ్నకు (పశ్చానాడికి) కుడి యెడమలందు ఇడా పింగళములమనబడు రెండు నాడులు నాసా పుటాంతములను బొంది యున్నవి. ఆ రెండింటికీ కుడి ఎడమలందు గాంధారీ యను నాడి, హస్తి జిహ్వ యను నాడి నేత్రాంతములను బొందియున్నవి. గాంధారీ హస్త జిహ్వ నాడులకు కుడి యెడమలుగా పూషా నాడి, అలంబూషా నాడి శ్రోత్రాంతములను బొందియున్నవి. పై యారు నాడులుగా శిరస్సున సుషుమ్న వ్యాపించినను శిరస్సు నుండి వ్రేలాడునప్పుడు అవి యొక్కటి యగుచు నిజావసానస్థాన పర్యంతము, (అనగా హృదయ పర్యంతము) నుండును - ఈ ఏడు నాడులు మూలాధారాగ్ని తేజస్సునకు సప్త జిహ్వలనబడును - సప్త జిహ్వలే సప్తార్చిషములు - (అనగా సప్త జ్వాలలు).

నాడులకు జన్మస్థానము నాభి యని కొందరందురు - దేహ మధ్యభాగముయొక్క కందము (అనగా వెన్నెముక యొక్క దిగువ భాగమున దుంప వంటిది) నాభి పర్యంతము వ్యాప్తమగుచున్నట్లు చెప్పుట గౌణ వ్యవహారము - ఆ కందములో మూలమందున్న కణుపు మూలాధారమనబడును, మధ్య కణుపు స్వాధిష్ఠానము. అగ్రమందున్న కణుపు మణిపూరము (నాభిస్థానము). పిమ్మట నాడీ జంతుజాలముతో గూడిన వెన్ను దండములో కందమునకు పైన యుండు నాల్గవ కణుపు అనాహతమై హృదయఫలకమునకు వెనుక నున్నది. ఐదవ పర్వము విశుద్ధమై కంఠమందున్నది, ఆరవది యాజ్ఞ యను పేరుతో శీర్షకుహురమందున్నది - కణుపులంతవరకే). దండము యొక్క అగ్రము సహస్రారము. ఆ దండిలో సుషుమ్న ద్వారా ప్రవహించు మూలాధార తేజశ్శక్తిని కుండలినీ యందురు).

  1. “కంద మధ్యేస్థితా నాడీ సుషుమ్నా సుప్రతిష్టితా |

పద్మ సూత్ర ప్రతీకా శా ఋజ రూర్థ్వ ప్రవృత్తినీ |

బ్రహ్మణో వివరం యావ ద్విద్యుదా భాస నాలకం |

వైష్ణవీ బ్రహ్మనాడీ చ నిర్వాణ ప్రాప్త పద్దతిః “.

(మూలకంద మధ్యమందు ప్రతిష్టించియున్న సుషుమ్న యను నాడి తామరతూడు మధ్యనుండు దారమువలె సన్నముగా నుండి మీదికి బ్రహ్మరంధ్రమువరకు వ్యాపించియుండును - మెరుపుతీగవలె ప్రకాశము కలిగి బ్రహ్మప్రాప్తికి మార్గమగుచున్నది. ఈ సుషుమ్నలోనే కుండలినీ యను శక్తి కలదు - సుషుమ్నా నాడియందు మూలాధారమున పడగ, ఊర్థ్వకుండలియందు తోక కలిగి సర్పాకారముకలదిగా కుండలినీ శక్తి యున్నది).

ఈ నాడినే సావిత్రి యనియు సరస్వతి యనియు చెప్పుదురు.

  1. “దేహమధ్యే బ్రహ్మనాడీ సుషుమ్నా సూర్యరూపిణీ పూర్ణచంద్రా భా వర్తతే. సాతు మూలాధారాదారభ్య బ్రహ్మరంధ్ర గామినీ భవతి. తన్మధ్యే తటిత్కోటి సమాన కాంత్యా మృణాళ సూత్రవత్ సూక్ష్మాంగీ కుండలినీతి ప్రసిద్ధా అస్తి. తాం దృష్ట్వా మనసైన నరః సర్వపాపవినాశద్వారా ముక్తో భవతి.” (అద్వియతారకోపనిషత్)

(దేహ మధ్యమందు సూర్యుని రూపము కలది, చంద్రునికాంతి కలదిన్నీ, బ్రహ్మనాడి యను పేరుగల సుషుమ్నా యను నాడి ఉన్నది. అది మూలాధారము మొదలుకొని బ్రహ్మరంధ్రమువఱకు ఉన్నది, దాని మధ్యమందు కోటి మెరుపు తీగలకాంతితో సమానమైన కాంతి గలదిన్నీ, తామర తూడులోని దారమువలె సూక్ష్మమైనదిన్నీ, కుండలినీ యను పేరుతో ప్రసిద్ధమైన నాడి యున్నది. దానిని మనసులో చూచిన నరుడు పాపములన్నింటినీ పోగొట్టుకొని ముక్తుడగును - మోక్షమును పొందును).

  1. “ఏకోత్తరం నాడి శతం తాసా యధ్యే పరాన్మృతా |

సుషుమ్నాతు వరేలీనా, విరజా బ్రహ్మ రూపిణీ |

ఇడా తిష్ఠతి వామేన, పింగళా దక్షిణేనతు |

తయోర్మధ్యే పరం స్థానం య సంవేద స వేదవిత్ |

ప్రాణం సంధారయేత్తస్మిన్ నాసాభ్యంతర చారిణః ||“. (యోగశిఖోపనిషత్)

(నాడులలో పరానాడి సుషుమ్న అను పేరుగలది యున్నది. అది బ్రహ్మరూపిణి. దానికి ఎడమ భాగమందు ఇడానాడియు, కుడిభాగమందు పింగళానాడియు కలవు. ఈ రెండు నాడులు మధ్యనున్నది బ్రహ్మరూపమైన సుషుమ్నా నాడి.దానిని తెలిసినవాడు వేదార్థమును తెలిసినవాడు).

  1. “కంద మధ్యే స్థితా నాడీ సుషుమ్నేతి ప్రకీర్తితా |”

(శరీరములోని మూలకందమను నాడీ చక్రము మధ్యనున్న నాడి సుషుమ్నయని చెప్పబడుచున్నది).

“మూలాధార సరోరుహే హుతవహస్థానే త్రికోణాంతరే |

కందే కుండలికా సుషుప్త పటలీ వాసాంతవర్ణాశ్రయే - - - “. (శ్రీరామకర్ణామృతం - 2 - 53)

(శరీరమధ్యమందు వీణా దండమువలె నున్న వెన్నెముక అధోభాగమున అగ్నికి స్థానమై (శరీరములో వేడిమిని కలిగించు స్థానమై), త్రికోణాకారముగా నుండి మూలాధారమను కమలరూపమైన, త్రికోణాకారముగానుండు కందమందు - నాడులలోని శక్తికి మూలమైన దానియందు - కుండలివలె (చుట్టుకొనియున్న పాము వలె) నుండు సుషుమ్నానాడి యందుండు శ్రీరామచంద్రపరబ్రహ్మను భజించుచున్నాను).

Transliteration
  1. “dēhē tu dakṣiṇē bhāgē vīṇā daṃḍa dēhabhṛt |

dīrghāsthi mūrtha paryaṃtaṃ brahma daṃḍēti kathyatē |

tasyāṃtē suṣiraṃ sūkṣmaṃ brahmanāḍīti sūribhiḥ |

iḍā piṃgaḷayō rmadhyē suṣumnā sūkṣmarūpiṇī ||“.

dēhamu venukabhāgamulō dēhamunu nilabeṭṭiyuṃcu vīṇādaṃḍamanu pedda emuka - vennemuka - unnadi (Back bone). adi śirassuvaraku galadu. dāninē brahmadaṃḍi yaṃduru - dāni lōpala iḍā piṃgaḷānāḍula madhya sūkṣma rūpamulō suṣumnā yanu pērugala sūkṣmanāḍi kaladu - dānini brahmanāḍi yani sūrijanulu ceppuduru -

  1. “suṣumnānāḍī mērudaṃḍē pṛṣṭasya vaṃśē sthitā |mūlādhāramārabhya pṛṣṭa vaṃśamārgēṇa brahmaraṃdhra paryaṃtaṃ gatā. tasyā vāmē iḍā dakṣiṇē piṃgaḷā asti, suṣumna mūla dēśē citrānāḍī asti. tasya madhyē (aṃtarē) harātmā biṃdu nādakaṃ ātmā mityāhakāra rēpha īkāra biṃdunādātmakaṃ asti”.

(śarīramulōni vennemuka mēru daṃḍi ani ceppabaḍucunnadi. dāni venuka aṃcuna ī suṣumna unnadi - idi mūlādhāramu modalukoni brahma daṃḍi dvārā śirassulōnunna brahmaraṃdhramuvaraku vyāpiṃciyunnadi. dāni eḍama prakka iḍānāḍiyu, kuḍiprakka piṃgaḷānāḍi yunnavi. ī suṣumna yokka mūlamaṃdu citrānāḍi yunnadi - dānilō brahma rūpamaina nādabiṃduvulunnavi).

  1. “brahmalōka prāpti dvāraṃbaguṭa suṣumna brahmanāḍi yanaṃbaragu” (śrīnādhuḍu - kāśīkhaṃḍamu).

  2. garbhastha jaṃtu śarīramaṃdu brahma raṃdhramudvārā ātma pravēśiṃci sakala tatvamulakunu cētanatvamu kalugacēyunu - idi brahmaraṃdhrādhō bhāgamaṃdu śukla varṇamugala okānoka mṛja padārthamunāśrayiṃci prakāśiṃcucunna tējōrūpamu - idi sudhāsthānamugānunnaṃduna caṃdramaṃḍalamani yāgama vēttalu ceppucunnāru -

“ā pravēśiṃcina ātmayaṃdu gala vimarśa śakti, anagā cinmaṃḍala tējaḥpuṃjamu brahmaraṃdhramunuṃci adhō mukhamugā vidyullatavale bayaludēri mūlādhāramunu poṃdi svādhiṣṭhānamu sthānamugā nunnadi, dīnini suṣumnā nāḍi yaniyu, jīvanāḍi, brahma nāḍi yani yāgama vēttalu ceppuduru - idi agnisvarūpamu.”

iṭula caṃdrāgnu lērpaḍinavi. ī brahmanāḍīmārgamaṃdunna saṃkētamulu mūlādhāra, svādhiṣṭhāna, maṇipūra, anāhata, viśuddha, ājñā, sahasrāramulu ani saptakamalamulu galavu. vīni sthānamulu pāyu, upastha,nābhi, hṛdaya, bhrūmadhya brahma raṃdhramulu - suṣumna yī kamalamulanu sṛjiṃcucu puṣpamālayaṃdu sūtramuvale nuṃḍisvādhiṣṭhānādi dīptini sahasrāramunaku vēdhiṃcucu, aṃduvalana kaligina amṛta dhārā pravāhamuvalana 72 nāḍī samudāyamunaku tṛptini kaluga cēyucu nuṃḍunu - ā agniyokka uṣṇādhikyamu amṛtavṛṣṭivalana śamiṃcunu - ī vṛṣṭivalana kaligina śītādhikyamu ī agnivalana śāṃtiṃcunu - gāna sama śītōṣṇamulu prāṇulaku sukhamu kalugucuṃḍunu -

ī nāḍi madhya madhyanu kamalamulaṃdu mātṛkā rūpamugā pradakṣiṇa rūpamugā paiki vyāpiṃcinaṃduna kauḷulu kuṃḍalini yokka ākāramugā nunnaṃduna dīnini kuṃḍalinī śakti yani vāḍuduru -

“ī nāḍiyaṃdu paramātma tējassu jīva saṃjñanu poṃdiyunnaṃduna brahmanāḍi yaniyu, sarasvati rūpamaina akārādi hakārāṃtamaina paṃcāśadvarṇamayamagu mātṛka yī nāḍī rūpamugā viśuddhādi ājñāṃtakamala rūpamunu poṃdi āyā daḷamulaṃdunnaṃduna parānāḍi yaniyu, vēdādi sakala vidyalu, sakala maṃtramulu, sakala vāgrūpa vyavahāramunaku nidi kāraṇamugā nunnaṃduna brahmanāḍi yaniyu vēdamaṃdu vāḍabaḍucunnadi”.

  1. mūlādhāramu modalukoni śirassu varaku oka sūkṣma nāḍi yunnadi. adiyē suṣumna. adi śirassunuṃḍi hṛdayamunaku tiruga vrēlāḍucunnadi. vrēlāḍu bhāgamunaku amṛtanāḍi (left vagus) yani pēru. ī nāḍi aṃtayu okkaṭiyē ayinanu venukaku koṃtabhāgamu (suṣumna), muṃdunaku koṃtabhāgamu (amṛta) unnaṃduna reṃḍu sādhanamārgamulu kaladi ani koṃdaraṃduru. suṣumnaku (paścānāḍiki) kuḍi yeḍamalaṃdu iḍā piṃgaḷamulamanabaḍu reṃḍu nāḍulu nāsā puṭāṃtamulanu boṃdi yunnavi. ā reṃḍiṃṭikī kuḍi eḍamalaṃdu gāṃdhārī yanu nāḍi, hasti jihva yanu nāḍi nētrāṃtamulanu boṃdiyunnavi. gāṃdhārī hasta jihva nāḍulaku kuḍi yeḍamalugā pūṣā nāḍi, alaṃbūṣā nāḍi śrōtrāṃtamulanu boṃdiyunnavi. pai yāru nāḍulugā śirassuna suṣumna vyāpiṃcinanu śirassu nuṃḍi vrēlāḍunappuḍu avi yokkaṭi yagucu nijāvasānasthāna paryaṃtamu, (anagā hṛdaya paryaṃtamu) nuṃḍunu - ī ēḍu nāḍulu mūlādhārāgni tējassunaku sapta jihvalanabaḍunu - sapta jihvalē saptārciṣamulu - (anagā sapta jvālalu).

nāḍulaku janmasthānamu nābhi yani koṃdaraṃduru - dēha madhyabhāgamuyokka kaṃdamu (anagā vennemuka yokka diguva bhāgamuna duṃpa vaṃṭidi) nābhi paryaṃtamu vyāptamagucunnaṭlu ceppuṭa gauṇa vyavahāramu - ā kaṃdamulō mūlamaṃdunna kaṇupu mūlādhāramanabaḍunu, madhya kaṇupu svādhiṣṭhānamu. agramaṃdunna kaṇupu maṇipūramu (nābhisthānamu). pimmaṭa nāḍī jaṃtujālamutō gūḍina vennu daṃḍamulō kaṃdamunaku paina yuṃḍu nālgava kaṇupu anāhatamai hṛdayaphalakamunaku venuka nunnadi. aidava parvamu viśuddhamai kaṃṭhamaṃdunnadi, āravadi yājña yanu pērutō śīrṣakuhuramaṃdunnadi - kaṇupulaṃtavarakē). daṃḍamu yokka agramu sahasrāramu. ā daṃḍilō suṣumna dvārā pravahiṃcu mūlādhāra tējaśśaktini kuṃḍalinī yaṃduru).

  1. “kaṃda madhyēsthitā nāḍī suṣumnā supratiṣṭitā |

padma sūtra pratīkā śā ṛja rūrthva pravṛttinī |

brahmaṇō vivaraṃ yāva dvidyudā bhāsa nālakaṃ |

vaiṣṇavī brahmanāḍī ca nirvāṇa prāpta paddatiḥ “.

(mūlakaṃda madhyamaṃdu pratiṣṭiṃciyunna suṣumna yanu nāḍi tāmaratūḍu madhyanuṃḍu dāramuvale sannamugā nuṃḍi mīdiki brahmaraṃdhramuvaraku vyāpiṃciyuṃḍunu - meruputīgavale prakāśamu kaligi brahmaprāptiki mārgamagucunnadi. ī suṣumnalōnē kuṃḍalinī yanu śakti kaladu - suṣumnā nāḍiyaṃdu mūlādhāramuna paḍaga, ūrthvakuṃḍaliyaṃdu tōka kaligi sarpākāramukaladigā kuṃḍalinī śakti yunnadi).

ī nāḍinē sāvitri yaniyu sarasvati yaniyu ceppuduru.

  1. “dēhamadhyē brahmanāḍī suṣumnā sūryarūpiṇī pūrṇacaṃdrā bhā vartatē. sātu mūlādhārādārabhya brahmaraṃdhra gāminī bhavati. tanmadhyē taṭitkōṭi samāna kāṃtyā mṛṇāḷa sūtravat sūkṣmāṃgī kuṃḍalinīti prasiddhā asti. tāṃ dṛṣṭvā manasaina naraḥ sarvapāpavināśadvārā muktō bhavati.” (adviyatārakōpaniṣat)

(dēha madhyamaṃdu sūryuni rūpamu kaladi, caṃdrunikāṃti kaladinnī, brahmanāḍi yanu pērugala suṣumnā yanu nāḍi unnadi. adi mūlādhāramu modalukoni brahmaraṃdhramuvaṟaku unnadi, dāni madhyamaṃdu kōṭi merupu tīgalakāṃtitō samānamaina kāṃti galadinnī, tāmara tūḍulōni dāramuvale sūkṣmamainadinnī, kuṃḍalinī yanu pērutō prasiddhamaina nāḍi yunnadi. dānini manasulō cūcina naruḍu pāpamulanniṃṭinī pōgoṭṭukoni muktuḍagunu - mōkṣamunu poṃdunu).

  1. “ēkōttaraṃ nāḍi śataṃ tāsā yadhyē parānmṛtā |

suṣumnātu varēlīnā, virajā brahma rūpiṇī |

iḍā tiṣṭhati vāmēna, piṃgaḷā dakṣiṇēnatu |

tayōrmadhyē paraṃ sthānaṃ ya saṃvēda sa vēdavit |

prāṇaṃ saṃdhārayēttasmin nāsābhyaṃtara cāriṇaḥ ||“. (yōgaśikhōpaniṣat)

(nāḍulalō parānāḍi suṣumna anu pērugaladi yunnadi. adi brahmarūpiṇi. dāniki eḍama bhāgamaṃdu iḍānāḍiyu, kuḍibhāgamaṃdu piṃgaḷānāḍiyu kalavu. ī reṃḍu nāḍulu madhyanunnadi brahmarūpamaina suṣumnā nāḍi.dānini telisinavāḍu vēdārthamunu telisinavāḍu).

  1. “kaṃda madhyē sthitā nāḍī suṣumnēti prakīrtitā |”

(śarīramulōni mūlakaṃdamanu nāḍī cakramu madhyanunna nāḍi suṣumnayani ceppabaḍucunnadi).

“mūlādhāra sarōruhē hutavahasthānē trikōṇāṃtarē |

kaṃdē kuṃḍalikā suṣupta paṭalī vāsāṃtavarṇāśrayē - - - “. (śrīrāmakarṇāmṛtaṃ - 2 - 53)

(śarīramadhyamaṃdu vīṇā daṃḍamuvale nunna vennemuka adhōbhāgamuna agniki sthānamai (śarīramulō vēḍimini kaligiṃcu sthānamai), trikōṇākāramugā nuṃḍi mūlādhāramanu kamalarūpamaina, trikōṇākāramugānuṃḍu kaṃdamaṃdu - nāḍulalōni śaktiki mūlamaina dāniyaṃdu - kuṃḍalivale (cuṭṭukoniyunna pāmu vale) nuṃḍu suṣumnānāḍi yaṃduṃḍu śrīrāmacaṃdraparabrahmanu bhajiṃcucunnānu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.