← Back to స · Booklets 51–60 (digitized file 6)

సూత్రము sūtramu

Original — తెలుగు
  1. దారము; నూలు పోగు, జన్నిదము (యజ్ఞోపవీతము)

  2. “అల్పాక్షర మసందిగ్ధం సారవ ద్విశ్వతోముఖం |

అస్తోభమనవద్యంచ సూత్రం విదో విదుః ||“.

(సాధ్యమగునంతవరకు స్వల్ప సంఖ్యగల యక్షరములు గలిగి, అర్థమును నిస్సన్శయముగా నొసంగుచు మిగుల సారవంతమై శాస్త్రము నందంతటను వ్యాప్తి కలిగి స్తోభము లేక నిర్దోషమై యుండు వాక్యమునకు సూత్రమందురు.

  1. “స్పష్టార్థములు, అసందిగ్ధము (నిస్సందేహము) సారము, సర్వశాస్త్రార్థమునందు ప్రవృత్తి గలిగి, అన్య గ్రంధములకు ఆధారమై ఎవ్వని చేతను అణచ బడని నిర్దోషమైనట్టి వాక్యమును సూత్రమందురు.”.

  2. “శ్లో||. సూచనాత్ సూత్రమిత్యుక్తం సూత్రం నామ పరం పదం |

తత్సూత్రం విదితం యేన స ముముక్షుస్స భిక్షుకః |

సవేదవిత్సదాచారః సవిప్రః పంక్తి పావనః |

యేన సర్వమిదం ప్రోతం సూత్రే మణి గనావ ఇవ |

తత్సూత్రం ధారయేద్యోగీ యోగవిద్బ్రాహ్మణో యతిః |

బహిస్సూత్ర్రం త్యజేద్విప్రో యోగజ్ఞాన తత్పరః |

బ్రహ్మ భావ మయం సూత్రం ధారయేద్యస్స ముక్తిభాక్ ||“. (ఆత్మోపనిషత్)

(సూచించునది కనుక సూత్రమనబడినది. సూత్రమనగా పరమపదము (మోక్షము, వైకుంఠము). ఆ సూత్రమును ఎవడు తెలుసుకొనునో వాడే ముముక్షువు, వాడే భిక్షకుడు, వాడే వేదార్థము నెఱిగినవాడు, సదాచారుడు, విప్రుడు (బ్రాహ్మణుడు) పంక్తి పావనుడు - నలుగుఱినీ పవిత్రులుగా చేయువాడు - దారములో మణులు గ్రుచ్చబడియుండునట్లు ఈ సర్వ ప్రపంచములోని వస్తువులన్నియు ఎవనిచేత వ్యాపించబడి యున్నవో (బట్టలోని పేక, పొడుగు దారములవలె) అదే సూత్రమనబడును. ఆ సూత్రమును యోగియైనవాడు - యోగమును తెలిసినవాడు, బ్రాహ్మణుడైనవాడు, యతి యైనవాడు ధరించవలెను - అంతరంగమందు ఆ సూత్రమైన పరమాత్మను ధరించవలెను - యోగమందు, విజ్ఞానమందు, బ్రహ్మజ్ఞానమందు తత్పరుడైనవాడు (బహిరంగముగా వాడబడే) యీ సూత్రమును వదలివేయవలెను - ముక్తి భాజనుడైనవాడు బ్రహ్మ భావమైన యీ సూత్రమును ధరించవలెను).

  1. “బ్రహ్మణః సృష్టిరూపం విధౌ దేహాది సృష్టి విధౌ పంచ భూతని సూత్రాణి సూత్ర రూపాణి మణిషు సూత్రవత్ సర్వదేహవ్యాపకాని”.

(బ్రహ్మ ఈ ప్రపంచమును సృష్టించు విధానములో, అనగా, దేహము మొదలగువాటిని సృష్టించు విధానములో పంచ భూతములు అయిన ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృధివి సూత్రములవలె ఉన్నవి. అనగా, మణులయందు దారము దూరి, వాటినన్నింటినీ విడిపోకుండగ ఉంచి కలియ కట్టినట్లు సృష్టిలోని అన్ని వస్తువులను కలియకట్టినట్లు, వస్తువులన్నింటిలోను పంచభూతములు దూరి వ్యాపించి ఒకదానితో ఒకటి కట్టి పెట్టునట్లు ఉంచినవి. అందుచేత ఈ ప్రపంచములోని వస్తువులన్నియు పంచభూతమయములు - పాంచ భౌతికములు. ఈ పంచభూతములు ఈ ప్రకారముగా అన్నింటిలోను వ్యాపించి, నిండి పట్టి యుంచుటచేత ఇది ప్రపంచమని చెప్పబడినది - “ప్రకర్షేణ పంచీకృతమితి ప్రపంచం” (బాగుగా - ఒక పద్దతి ననుసరించి, తప్పు లేకుండ పంచభూతములు కలిసి యున్నట్లు చేయబడినది - ఇంత చిత్ర విచిత్రమైన పంచీ కరణము - దానివలన కలుగు వివిధమైన మార్పులతో వస్తువులు తయారగుట - భగవంతునికి తప్ప ఇంకెవరికి సాధ్యము కాదు - అందుచేత భగవంతుడు సర్వజ్ఞుడు “యస్సర్వజ్ఞః సర్వ విద్” అని చెప్పబడుచున్నాడు).

  1. సూత్రప్రాయముగా, సూక్ష్మముగా వ్రాయబడినది అయినను విపులార్థము కలిగినది, అన్యధా వ్యాఖ్యానమునకు వీలుకాని పదములు గలది - సూత్రము - ఇటువంటి సూత్రములు మూడు గలవు - వ్యాసమహర్షి వ్రాసిన బ్రహ్మ సూత్రములు, నారదమహర్షి వ్రాసిన భక్తి సూత్రములు, పతంజలి వ్రాసిన యోగసూత్రములు.

  2. “క్రియా శక్తి ప్రథానం మహత్తత్వం జీవ సంసార హేతుభూతం”.

(ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తులలో ఒకటి అయిన క్ర్యాశక్తి ప్రథానమైన మహత్తత్త్వము - జీవుని సంసారమునకు కారణమైనది)

  1. యేన సర్వమిదం ప్రోతం సూత్రే మణి గణా ఇవ “యేన సూత్రేణ బ్రహ్మణా సర్వం నిఖిలమిదం భూత భౌతిక ప్రపంచజాతం ప్రోతం ప్రకర్షేణోతం అనువిధ్ధం వర్తతే”.

(మణులు ఒకదారముతో గ్రుచ్చబడి యుండునట్లు ఈ భూత భౌతికములతో నిండియున్న ప్రపంచమంతయు పరబ్రహ్మ యను సూత్రముచే కట్టబడియున్నది - పరబ్రహ్మశక్తికి లోబడియున్నది మణులన్నింటిలోను దారము దూరి ఉన్నట్లు ప్రపంచములోని వస్తువులన్నింటిలోను భగవంతుడు వ్యాపించియుండి వాటిని కట్టు దిట్టముగానుంచినాడు). “ఓత ప్రోత సమస్త వస్తు నిచయం”

(శ్రీరామ కర్ణామృతం - 2 - 50)

  1. “కర్మణ్యాది కృతాయే తు వైదికే బ్రాహ్మణాదయః |

తే భిర్థార్యమిదం సూత్రం క్రియాంగం తద్ధి వైస్మృతం ||“.

(వైదిక కర్మ చేయుట యందు అధికారము పొందినవారు (బ్రాహ్మణులు మొదలగువారు) ధరించవలనిన సూత్రము - జన్నిదము - యజ్ఞోపవీతము)

Transliteration
  1. dāramu; nūlu pōgu, jannidamu (yajñōpavītamu)

  2. “alpākṣara masaṃdigdhaṃ sārava dviśvatōmukhaṃ |

astōbhamanavadyaṃca sūtraṃ vidō viduḥ ||“.

(sādhyamagunaṃtavaraku svalpa saṃkhyagala yakṣaramulu galigi, arthamunu nissanśayamugā nosaṃgucu migula sāravaṃtamai śāstramu naṃdaṃtaṭanu vyāpti kaligi stōbhamu lēka nirdōṣamai yuṃḍu vākyamunaku sūtramaṃduru.

  1. “spaṣṭārthamulu, asaṃdigdhamu (nissaṃdēhamu) sāramu, sarvaśāstrārthamunaṃdu pravṛtti galigi, anya graṃdhamulaku ādhāramai evvani cētanu aṇaca baḍani nirdōṣamainaṭṭi vākyamunu sūtramaṃduru.”.

  2. “ślō||. sūcanāt sūtramityuktaṃ sūtraṃ nāma paraṃ padaṃ |

tatsūtraṃ viditaṃ yēna sa mumukṣussa bhikṣukaḥ |

savēdavitsadācāraḥ savipraḥ paṃkti pāvanaḥ |

yēna sarvamidaṃ prōtaṃ sūtrē maṇi ganāva iva |

tatsūtraṃ dhārayēdyōgī yōgavidbrāhmaṇō yatiḥ |

bahissūtrraṃ tyajēdviprō yōgajñāna tatparaḥ |

brahma bhāva mayaṃ sūtraṃ dhārayēdyassa muktibhāk ||“. (ātmōpaniṣat)

(sūciṃcunadi kanuka sūtramanabaḍinadi. sūtramanagā paramapadamu (mōkṣamu, vaikuṃṭhamu). ā sūtramunu evaḍu telusukonunō vāḍē mumukṣuvu, vāḍē bhikṣakuḍu, vāḍē vēdārthamu neṟiginavāḍu, sadācāruḍu, vipruḍu (brāhmaṇuḍu) paṃkti pāvanuḍu - naluguṟinī pavitrulugā cēyuvāḍu - dāramulō maṇulu gruccabaḍiyuṃḍunaṭlu ī sarva prapaṃcamulōni vastuvulanniyu evanicēta vyāpiṃcabaḍi yunnavō (baṭṭalōni pēka, poḍugu dāramulavale) adē sūtramanabaḍunu. ā sūtramunu yōgiyainavāḍu - yōgamunu telisinavāḍu, brāhmaṇuḍainavāḍu, yati yainavāḍu dhariṃcavalenu - aṃtaraṃgamaṃdu ā sūtramaina paramātmanu dhariṃcavalenu - yōgamaṃdu, vijñānamaṃdu, brahmajñānamaṃdu tatparuḍainavāḍu (bahiraṃgamugā vāḍabaḍē) yī sūtramunu vadalivēyavalenu - mukti bhājanuḍainavāḍu brahma bhāvamaina yī sūtramunu dhariṃcavalenu).

  1. “brahmaṇaḥ sṛṣṭirūpaṃ vidhau dēhādi sṛṣṭi vidhau paṃca bhūtani sūtrāṇi sūtra rūpāṇi maṇiṣu sūtravat sarvadēhavyāpakāni”.

(brahma ī prapaṃcamunu sṛṣṭiṃcu vidhānamulō, anagā, dēhamu modalaguvāṭini sṛṣṭiṃcu vidhānamulō paṃca bhūtamulu ayina ākāśamu, vāyuvu, agni, jalamu, pṛdhivi sūtramulavale unnavi. anagā, maṇulayaṃdu dāramu dūri, vāṭinanniṃṭinī viḍipōkuṃḍaga uṃci kaliya kaṭṭinaṭlu sṛṣṭilōni anni vastuvulanu kaliyakaṭṭinaṭlu, vastuvulanniṃṭilōnu paṃcabhūtamulu dūri vyāpiṃci okadānitō okaṭi kaṭṭi peṭṭunaṭlu uṃcinavi. aṃducēta ī prapaṃcamulōni vastuvulanniyu paṃcabhūtamayamulu - pāṃca bhautikamulu. ī paṃcabhūtamulu ī prakāramugā anniṃṭilōnu vyāpiṃci, niṃḍi paṭṭi yuṃcuṭacēta idi prapaṃcamani ceppabaḍinadi - “prakarṣēṇa paṃcīkṛtamiti prapaṃcaṃ” (bāgugā - oka paddati nanusariṃci, tappu lēkuṃḍa paṃcabhūtamulu kalisi yunnaṭlu cēyabaḍinadi - iṃta citra vicitramaina paṃcī karaṇamu - dānivalana kalugu vividhamaina mārpulatō vastuvulu tayāraguṭa - bhagavaṃtuniki tappa iṃkevariki sādhyamu kādu - aṃducēta bhagavaṃtuḍu sarvajñuḍu “yassarvajñaḥ sarva vid” ani ceppabaḍucunnāḍu).

  1. sūtraprāyamugā, sūkṣmamugā vrāyabaḍinadi ayinanu vipulārthamu kaliginadi, anyadhā vyākhyānamunaku vīlukāni padamulu galadi - sūtramu - iṭuvaṃṭi sūtramulu mūḍu galavu - vyāsamaharṣi vrāsina brahma sūtramulu, nāradamaharṣi vrāsina bhakti sūtramulu, pataṃjali vrāsina yōgasūtramulu.

  2. “kriyā śakti prathānaṃ mahattatvaṃ jīva saṃsāra hētubhūtaṃ”.

(icchā jñāna kriyā śaktulalō okaṭi ayina kryāśakti prathānamaina mahattattvamu - jīvuni saṃsāramunaku kāraṇamainadi)

  1. yēna sarvamidaṃ prōtaṃ sūtrē maṇi gaṇā iva “yēna sūtrēṇa brahmaṇā sarvaṃ nikhilamidaṃ bhūta bhautika prapaṃcajātaṃ prōtaṃ prakarṣēṇōtaṃ anuvidhdhaṃ vartatē”.

(maṇulu okadāramutō gruccabaḍi yuṃḍunaṭlu ī bhūta bhautikamulatō niṃḍiyunna prapaṃcamaṃtayu parabrahma yanu sūtramucē kaṭṭabaḍiyunnadi - parabrahmaśaktiki lōbaḍiyunnadi maṇulanniṃṭilōnu dāramu dūri unnaṭlu prapaṃcamulōni vastuvulanniṃṭilōnu bhagavaṃtuḍu vyāpiṃciyuṃḍi vāṭini kaṭṭu diṭṭamugānuṃcināḍu). “ōta prōta samasta vastu nicayaṃ”

(śrīrāma karṇāmṛtaṃ - 2 - 50)

  1. “karmaṇyādi kṛtāyē tu vaidikē brāhmaṇādayaḥ |

tē bhirthāryamidaṃ sūtraṃ kriyāṃgaṃ taddhi vaismṛtaṃ ||“.

(vaidika karma cēyuṭa yaṃdu adhikāramu poṃdinavāru (brāhmaṇulu modalaguvāru) dhariṃcavalanina sūtramu - jannidamu - yajñōpavītamu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.