← Back to స · Booklets 51–60 (digitized file 6)

సూత్రాత్మా sūtrātmā

Original — తెలుగు
  1. సర్వభూతాంతరాత్మా.

(భూతములన్నింటియందు అంతరాత్మగా ఉండి, వాటి నన్నింటినీ, దారము మణులను కట్టిపెట్టి యుంచినట్లు - తన శక్తిచే లాగి పట్టుకొని యుంచువాడు - వాటినన్నింటికి తనశక్తిని వ్యాపింపచేయువాడు). (వ్యాపింప చేసి వాటిని తన ఆధీనములో నుంచుకొనువాడు).

  1. సూత్రాత్మానామ పిండాడావచ్ఛిన్నో వాయుః, లింగ శరీరస్య అర్చిరాది మార్గ ప్రాపకః -

(సూత్రాత్మ యనగా పిండాండములలోని ఎడతెగని ఒకే వాయువు శక్తి - వాయు రూపములో ఆత్మ లింగశరీరమును - సూక్ష్మశరీరమును - అర్చిరాది మార్గముద్వారా తీసుకొనివెళ్ళు శక్తి).

  1. “సకల భూతాలకున్నూ ఆశ్రయమైనది హిరణ్యగర్భి శరీరము. ఇందులో వ్యాపకమైన ఆత్మ - సూత్రాత్మ”.

  2. “లింగశరీర సమష్ట్యభిమానీ, మహా ప్రాణుండు, సూత్రాత్ముడు, ఇవి మొదలగునవి హిరణ్యగర్భుని పర్యాయ నామములు”

(వివేక చింతామణి)

Transliteration
  1. sarvabhūtāṃtarātmā.

(bhūtamulanniṃṭiyaṃdu aṃtarātmagā uṃḍi, vāṭi nanniṃṭinī, dāramu maṇulanu kaṭṭipeṭṭi yuṃcinaṭlu - tana śakticē lāgi paṭṭukoni yuṃcuvāḍu - vāṭinanniṃṭiki tanaśaktini vyāpiṃpacēyuvāḍu). (vyāpiṃpa cēsi vāṭini tana ādhīnamulō nuṃcukonuvāḍu).

  1. sūtrātmānāma piṃḍāḍāvacchinnō vāyuḥ, liṃga śarīrasya arcirādi mārga prāpakaḥ -

(sūtrātma yanagā piṃḍāṃḍamulalōni eḍategani okē vāyuvu śakti - vāyu rūpamulō ātma liṃgaśarīramunu - sūkṣmaśarīramunu - arcirādi mārgamudvārā tīsukoniveḷḷu śakti).

  1. “sakala bhūtālakunnū āśrayamainadi hiraṇyagarbhi śarīramu. iṃdulō vyāpakamaina ātma - sūtrātma”.

  2. “liṃgaśarīra samaṣṭyabhimānī, mahā prāṇuṃḍu, sūtrātmuḍu, ivi modalagunavi hiraṇyagarbhuni paryāya nāmamulu”

(vivēka ciṃtāmaṇi)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.