← Back to స · Booklets 51–60 (digitized file 6)

స్వభావః svabhāvaḥ

Original — తెలుగు
  1. స్వభావో నామ పదార్థానాం ప్రతినియతా శక్తిః, - అగ్నే రౌష్ణమివ.

(పదార్థములలో కలుగుశక్తి - అగ్నికి వేడిమి స్వభావము, నీటికి తడి స్వభావము, ఱాతికి కఠినముగా నుండుట స్వభావము - అగ్ని వేడిగానుండుటే కాని చల్లగా నుండనేరదు -)

  1. స్వస్వభావః స్వభావః

(పదార్థముయొక్క స్వస్వరూపస్థితి - అగ్నికి వేడిగా నుండుట ధర్మము - అగ్ని వేడిమి, చల్లదనము అను రెండు విరుద్ధధర్మములు కలిగియుండదు - అగ్నికి వేడిమియే అసాధారణ ధర్మము - వేడిగా నుండుటయే దాని స్వభావము_.

  1. వహ్న్యే ష్ణవత్స భావత్వాత్ స్వభావో దురతి క్రమః ||. (గీతాభావప్రకాశము - 2 - 552)

(అగ్నికి స్వభావమైన వేడిమివలె స్వభావము అనునది అతిక్రమింప శక్యము కానిది - అగ్ని దాని ధర్మము - స్వభావము - అయిన వేడిమిని ఎప్పుడూ వదలదు - “స్వభావము అతిక్రమింప శక్యము కానిది” అనునది ఒక న్యాయము).

  1. వస్తునః స్వభావికో ధర్మః - పరిణామ హేతుః -

(వస్తువు యొక్క స్వభావికమైన ధర్మము - వస్తువు మార్పు చెందుటకు కారణమైనది).

  1. “స్వః భావః స్వభావః, అవిద్యా లక్షణా ప్రకృతిః మాయా ప్రవర్తతే” (శ్రీశంకరః)

(అవిద్య యను మాయా ప్రకృతియే సత్వరజస్తమములను తన త్రిగుణములద్వారా వ్యవహరించును - అదియే స్వభావము).

  1. “శ్రుణు స్వభావ శబ్దేన మాయా (అ)విద్యాది శబ్దితా |

ప్రకృతిర్యాస్తి సైవేయం వ్యవహారే ప్రవర్తతే ||“. (గీతాభావప్రకాశము - )

(మాయ, అవిద్య, ప్రకృతి యని చెప్పబడినదే స్వభావముగా వ్యవహారములో ప్రవర్తించుచున్నది. అనగా ఇదియే కర్మలు చేయించుచున్నది - వాటి ఫలము ననుభవింప చేయుచున్నది).

  1. మాయా(అ)విద్యాభిదా శక్తిః స్వభావఖ్యా ప్రవర్తతే | (గీతాభావప్రకాశము - 5 - 119)

(అవిద్య యను పేరుగల మాయయే స్వభావమని చెప్పబడుచున్నది).

  1. “అజ్ఞానాత్మికా దైవీ మాయా ప్రకృతిః” (మధుసూధనీవ్యాఖ్యా)

(అజ్ఞానరూపమై దైవ సంబంధమైన మాయ యను ప్రకృతి).

  1. ఈశ్వరస్య ప్రకృతిః త్రిగుణాత్మికా -

(సత్వరజస్తమములుగల ఈశ్వరుని ప్రకృతి)

  1. సత్వాది గుణత్రయ రూపః

(సత్వరజస్తమములను మూడుగుణముల (హెచ్చుతగ్గులతో) కూడియుండునది) “సత్వాది ప్రవృత్తిః” (సత్వరజస్తమములను త్రిగుణముల వ్యాపారము).

  1. ప్రకృతిః, అనాత్మభూతం ఆత్మని సంబధ్యమానం భూత సూక్ష్మ తద్వాసనాదికం -

(ప్రకృతి - ఆత్మయందు బంధింపబడిన అనాత్మవస్తువు సూక్ష్మభూతము, దాని వాసన మొదలగునవి).

  1. స్వస్వ = తనయొక్క; భావః = సంకల్పము - తనయొక్క సంకల్పము. సంకల్పము లేనిదే స్వభావముండదు. సంకల్పము అనగా నేను ఈ పని చేసెదను - అని మనసులో కలిగిన ఊహ. ఈ ఊహ మనిషి తత్వమును బట్టి కలుగును - అందుచేత అదియే వాని స్వభావము)

  2. స్వాసాధారణో భావః, ప్రాచీన వాసనా నిమిత్తః, తత్తద్రుచి విశేషం, యత్ర రుచిః తత్ర శ్రద్ధాజాయతే.

(తనయొక్క అసాధారణ భావము - (special) - తనకు ఒక్కనికే కలుగు భావము. గతించిన జన్మలలోని కర్మలవలన కలిగిన వాసనలే కారణముగా గలది. ఆ కర్మల ఫలితముగా - వాసన రూపముగా - ఈ జన్మలో కలిగిన స్వభావము - తనకు ప్రత్యేకమగు ప్రవర్తన అట్టి వాసనలవలన కలిగి కొన్ని కొన్ని ప్రక్రియల యడల కలుగు రుచి - ఇష్టము కలిగియుండుట. దేనియందు ఇష్టము కలిగి యుండిన దానియందే శ్రద్ధ కలుగును. అట్తి శ్రద్ధ కలిగియుండుటే స్వభావము).

  1. “జన్మాంతరకృత ధర్మాది సంస్కారః, మరణకాలే అభివ్యక్తః స్వభావః ఉచ్యతే -” (శ్రీశంకరః)

(క్రిందటి జన్మలలో చేసిన పుణ్యము మొదలగువాటి సంస్కారము - చనిపోవునపుడు వ్యక్తమగునది - కనబడునది - సూచనగా కనబడునది - స్వభావమని చెప్పబడుచున్నది).

  1. ప్రకృతి వాసనా - అనాదికాల ప్రవృత్త పూర్వ పూర్వ కర్మ జనిత దేవాద్యాకార ప్రకృతి సంసర్గ కృత తత్తదాత్మాభిమాన జనిత వాసనా కృతం. ఈ దృశం కర్తృత్వాదికం సర్వం స్వరూప ప్రయుక్తః ఇత్యర్థః.

(మానవుని ప్రకృతివలన సత్వరజస్తమోగుణములు హెచ్చు తక్కువలు వలన కలిగిన వాసన అనాదికాలము నుండి వచ్చుచున్న పూర్వ జన్మలలో చేసిన కర్మ వలన కలిగిన దేవతలు మొదలగు ఆకారములు, వాటి ప్రకృతి (నైజగుణము) వలన కలిగిన ఆయా శరీరములందలి అభిమానమువలన కలిగిన వాసన కారణముగా తయారయిన స్వభావము. ఇటువంటి కర్తృత్వము మొదలగునదంతయు స్వరూప ప్రయుక్తము)

  1. సహజ వాసనా రూపం

(తనతోనే పుట్టిన పూర్వజన్మముల వాసన - అను భవము వలన కలిగిన తత్వము, స్వభావము, గుణము, ధర్మము).

  1. “శ్రుణు ప్రాగ్జన్మ సంస్కారో ధర్మా ధర్మైక గోచరః |

వర్తమాన భవే వ్యక్తః సర్వతో బలవాంశ్చయః |

ప్రకృతిః సా స్వకీయ యా స్తస్యాః సదృశమేవహి |

సర్వోపి గుణ దోషజ్ఞశ్చేష్టతే, కిము మూఢ ధీః |

తస్మా త్సర్వే అనువర్తంతే ప్రాణినః ప్రకృతిం స్వికాం |

పురుషార్థక్షయే హేతుభూతా మపి దురిత్యయాం |

రాజ్ఞోవా మమ వా తత్ర నిగ్ఫ్రహః కిం కరిష్యతి |

రాగౌత్కట్యేన దురితాన్ని నివారయితుం క్షమాః |

మహా నరక హేతుత్వం జ్ఞాత్యాపి వాసనా బలాత్ |

ప్రవర్తమానాః పాపేషు మదాజ్ఞాతి క్రమాదపి |

న చిభ్యతీతి తాత్పర్యం హరేర్నారాయణస్య చ ||“. (గీతాభావప్రకాశము - 3 - 202 to 207)

(పాప పుణ్యములతో కూడిన క్రిందటి జన్మల సంస్కారము ఈ వర్తమాన జన్మలో (ఇప్పుడు జరుగుతున్న జన్మలో) వ్యక్తమగునది, బలము గలది, యేది కలదో అదియే తనయొక్క ప్రకృతి. దీని గుణ దోషములు తెలిసినవాడైనను ఆ ప్రకృతి - నైజము - ప్రకారము నడచును - ప్రవర్తించును. మూఢుని గుఱించి వేఱే చెప్పనవసరము లేదు - అందుచేత సమస్తమైన జీవులు వారి వారి ప్రకృతిని - స్వభావమును - (అది పురుషార్థముల సాధనను క్షీణింపచేసినను) - అనువర్తించుచున్నారు - వారి ప్రకృతి - నైజము - ప్రకారము ప్రవర్తించుచున్నారు. ఈ విషయములో (ఆజ్ఞచేయు) రాజుగాని, (భగవంతుడనైన) నేను గాని ఏమియు చేయలేము - వారికి వారి ప్రకృతి ప్రకారము ఉద్రేకము వలన కలుగు చేష్టలను నివారించుట శక్యము కాదు - అట్టివారి స్వభావము గొప్ప నరకమును పొందించుటకు కారణమైనదని తెలిసియు వారి పూర్వ జన్మల కలిగిన వాసనా బలము వలన పాపాకర్మల చేయువారై నా ఆజ్ఞను (శాస్త్ర బోధనను) అతిక్రమించినను వారు భయము చెందరు - అని తాత్పర్యము).

  1. స్వకీయో భావః స్వభావః బ్రాహ్మణాది జన్మహేతు భూతం, ప్రాచీన కర్మ ఇత్యర్థః - తత్ప్రభావాః సత్వాదయో గుణాః.

(శ్రీమాన్ రామానుజః)

(తన భావము - బ్రాహ్మణుడు మొదలగు జన్మలకు కారణమైనది. ఇదివరకు జన్మలలో చేసిన కర్మ అని అర్థము).

  1. జన్మాంతర కృత సంస్కారః, ప్రాణినాం వర్తమాన జన్మని స్వ కార్యాభి ముఖత్వేన అభివ్యక్తః స్వభావః సః ప్రభవః యేషాం గుణానాం తే స్వభావ ప్రభవాః గుణాః, గుణప్రాదుర్భావస్య నిష్కారణానుపపత్తే ః -

(ఇదివరకు జన్మలలో కలిగిన సంస్కారము ప్రస్తుత జన్మలో వాటి కార్యమును చేయుటకు - కర్మఫలమును చూపుటకు అభిముఖము అయి - సిద్ధమయి - వ్యక్తమైనది - చేష్టలలో పైకి కనబడునది స్వభావము - ఈ స్వభావము ఏ గుణములను కలుగచేయునో అవి స్వభావప్రభావమైన గుణములు - కుణములు (సత్వరజస్తమోగుణములు) నిష్కారణముగా కలుగవు - వాటికి కారణముండవలెను - అదియే స్వభావము).

  1. స్వస్య హేతుః ఇతి స్వభావః -

(తనకు కారణమైనది, తన ప్రవర్తనకు కారణమైనది స్వభావము).

  1. సర్వభూతానాం పరిణామ హేతుః -

  2. స్వయమేవ భవతీతి స్వభావః -

(దానంతట అదే కలుగునది స్వభావము - ఒకరు చెప్పినమీదట కలుగునది కాది - నైజము - “హీనుడవగుణంబు మానలేడు” -

  1. “స్వయమేవ సర్వంభావయతీతి స్వభావః - స్వం భావయతీతివా స్వభావః”

(స్వయముగా సర్వమును భావింప చేయునది - ఇష్టానిష్టములు కలుగచేసి తద్వారా కష్ట సుఖములను కలుగచేయునది. ఇట్లు స్వభావము కష్టములను అనుభవింప చయుచుండగా ఆత్మ తటస్థముగా నుండును).

  1. “ప్రకృతే రన్యథా భావో న కథం చిద్భవిష్యతి”.

(దేని స్వభావముకంటె అది మరొక రీతిగా నుండదు - ప్రతి వస్తువు దాని స్వభావము ననుసరించియే యుండును గాని వేరు విధముగా నుండదు - “పులి పిల్లకు ఓకచార అయిన నుండును”, - తేలునకు కుట్టుటయే స్వభావము).

  1. “స్వభావజేన కౌంతేయ నిబద్ధః స్వేన కర్మణా |

కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్య వశోపి తత్ ” (శ్రీమద్భగవద్గీత - 18 - 60)

(తన స్వభావరూపమగు కర్మచేత జీవుడు బద్ధుడగుచున్నాడు. ఏ పని నీవు చేయకయుండ తలంచితివో దానిని మోహముచేత, స్వభావముచేత - నీ స్వభావమునకు వశుడవై - చేయుదువు. నీవు చేయు కర్మలు నీ వశములో లేవు, నీ స్వభావముయొక్క వశములో నున్నవి. నీకు ఇష్టములేని పనుల నైనను నీ స్వభావమువలన నీవు చేయవలసియుండును, చేయుదువు).

  1. “న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః |

న కర్మఫల సం యోగం స్వభావస్తు ప్రవర్తతే ||“. (శ్రీమద్భగవద్గీత - 5 - 14)

(లోకమునకు - లోకులకు కర్తృత్వముగాని, కర్మఫలముల భోక్తృత్వముకాని (అనుభవముకాని) భగవంతుడు కలుగ చేయుటలేదు - స్వభావమే వీటన్నింటినీ కలుగచేయుచున్నది).

  1. “స్వస్యైవ బ్రహ్మణ ఏవ అంశతయా జీవరూపేణభవనం స్వభావః”

(పరబ్రహ్మ యొక్క అంశయే జీవరూపముగా అగుట లేక పుట్టుట స్వభావము - పరబ్రహ్మ జీవభావము నొందుట, జీవరూపము నొందుట స్వభావము)

  1. “స్వాఖ్యో భావః స్వభావః ఇతి వుత్పత్యా జీవోవా స్వభావః సర్వదా అస్త్యేవ ఏక ప్రకారేణ ఇతి భావః. అంతఃకరణాది వ్యావృత్యర్థో భావ శబ్దః నహి ఏక ప్రకారేణ స్థితిః. అంతఃకరణాదేః వికారిత్వాత్ - స్వ శబ్దః ఈశ్వర వ్యావృత్యర్థః ||” (శ్రీ ఆనందతీర్థః)

(‘తను’ అను భావము - అను వుత్పత్యర్థము ప్రకారము స్వభావము అనగా తనే - ఆ భగవంతుడే, జీవుడే - జీవ రూపములో నున్న భగవంతుడే - ఎల్లపుడు ఒకే ప్రకారముగా నుండువాడు అని అర్థము. ‘భావము’ అను మాట అంతఃకరణము మొదలగు వాటి వృత్తిని తెలియచేయునది. అంతఃకరణము మొదలగునవి మార్పులు కలవగుటచేత ఒకే ప్రకారముగా నుండుట కాదు - ‘స్వ’ అను మాట భగవంతుని గుఱించి చెప్పునది - ‘స్వస్వభావము’).

  1. “పరిస్య బ్రహ్మణః ప్రతిదేహం ప్రత్యగాత్మ భావః, స్వభావః. (సో భావః = స్వభావః) అధ్యాత్మం ఉచ్యతే” (శ్రీశంకరః)

(పరబ్రహ్మకు ప్రతిదేహము ప్రత్యగాత్మభావము, అధ్యాత్మమని చెప్పబడును. అదియే స్వః భావః - స్వభావము - జీవుడు - తన యొక్క - భావమే రూపమే).

  1. “జీవస్య అయం జైవో అంతఃకరణాదిః దేహ పర్యంతః పదార్థః స్వభావః”, స్వస్వభావః స్వభావః “ఇతి వ్యుత్పత్యాతే బ్రహ్మ తద్విదుః” ఇతి జీవానాం ప్రకృతత్వాత్ ‘స్వ’ శబ్దో జీవవాచీ (జయతీర్థమునిః)

(జీవునిదైన అంతఃకరణము మొదలైనది దేహము వరకు గల పదార్థము - స్వభావము - స్వ = బ్రహ్మ యొక్క భావః = భావము అను వ్యుత్పత్యర్థమును బట్టి వారు - బ్రహ్మజ్ఞానులు - జీవుడు బ్రహ్మమేయని యెరిగిరి - అని చెప్పుటవలన స్వ శబ్దము జీవుని గుఱించి చెప్పునదియే).

  1. “వ. దేహంబునకు ద్రవ్యంబులైన మహాభూతంబులును జన్మ నిమిత్తంబులైన కర్మంబులును, గర్మక్షోభకంబైన కాలంబును, గాలపరిణామ హేతువైన స్వభావంబును, భోక్తయైన జీవుండును, వాసుదేవుండకా నెఱుంగుము”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 5 - 84)

  2. “వ. అమ్మహనీయ తేజోనిధి మొదలి యవతారంబు సహస్ర శీర్షాది యుక్తంబయి ప్రకృతి ప్రవర్తకంబగు నాది పురుష రూపంబగు. అందు గాలస్వభావంబులను శక్తు లుదయించె”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 6 - 112)

  3. “పరిణామ సంపాదకో గుణ విశేషః. స చ స్వభావః కాలస్య శక్తిర్వా, ప్రకృతేః స్వభావో వా, భగవతః లీలా రసానుగుణ స్వభావోవా”.

(మార్పులను కలుగచేయు గుణవిశేషము - అది స్వభావము. కాలము యొక్క శక్తి, లేక ప్రకృతియొక్క స్వభావము, లేక, భగవంతునియొక్క లీలాగుణముయొక్క స్వభావము)

  1. “స్వభావో అధ్యాత్మ ముచ్యతే” (శ్రీమద్భగవద్గీత - 8 - 3)

“స్వాభావః స్వస్వ రూపం యత్ప్రత్య క్చైతన్య మేవహి |

ఉచ్యతే అధ్యాత్మ శబ్దేన నేంద్రియగ్రామ ఇత్యయః ||“. (గీతాభావప్రకాశము -)

(తన స్వరూపమే - జీవ శరీరమునధిష్టించి యున్న జీవుడే ప్రత్యక్ చైతన్యము, అదియే స్వభావము, అదియే ఆధ్యాత్మము, పరబ్రహ్మతత్వము - స్వస్వరూపము - అందుచేత స్వభావమనగా ఇంద్రియములుకావు).

  1. “సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతే ర్జ్ఞాన వానపి |

ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి ||“. (శ్రీమద్భగవద్గీత - 3 - 33)

(జ్ఞాని అయినను తన స్వభావము ననుసరించియే పనులు చేయును - భూతములు - ప్రాణులు - వాటి వాటి ప్రకృతినే పొందుచుండును - (స్వభావమునే పొందుచుండును) - దానిని అడ్డుటకుగాని, మార్చుటకుగాని ఎవరును ఏమియును చేయజాలరు).

  1. “అనేక తడవలు ఒక కార్యమును ఒక విధముగా చేసి మరల అదే విధముగా చేయుచు వచ్చినందున సంపాదింపబడిన వాడుక లేక అలవాటు. ఇదే విధముగా మనస్సునకును వాడుకలు - అలవాట్లు ఏర్పడును - కార్యములను సంకల్పించి వికల్పించి అనేక కోట్లమార్లు తలంపులను తలచినందున ఏర్పడిన వాడుక, లేక, అలవాటు. దీనినే మనోవాసన అని చెప్పుదురు - వాసనా జాలమునకు స్వభావమని పేరు”.

  2. “అప్పుడే పుట్టిన బిడ్డకు ఎవరును నేర్పించకనే తన తల్లిపాలను పీల్చు శక్తినే స్వభావమందురు - అనేక జన్మలందు తల్లిపాలు పీల్చి, త్రాగి అభ్యాసమైనందున కలిగిన శక్తి”.

  3. స్వభావము జన్మతో కూడ పుట్టినది, నశింప చేయుటకు వీలు కానిది, పూర్తిగ నిరోధింప జాలనిది - “పుట్టుకతో పుట్టిన బుద్ధి పుడకలతోనే పోవును” - జన్మతో పుట్టినది మరణమువరకు ఉండును).

  4. “బ్రాహ్మణ క్షత్రియ విశాం శూద్రాణాం చ పరంతప |

కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః ||.” (శ్రీమద్భగవద్గీత - 18 - 41)

(బ్రాహ్మణులకు, క్షత్రియులకు వైశ్యులకు శూద్రులకు వారి వారి స్వభావము వలన కలిగిన గుణములను బట్టి వారికి కర్మలు విభజింపబడినవి).

  1. “బ్రాహ్మణ స్వభావస్య సత్వ గుణః ప్రభవః కారణం. తథా క్షత్రియ స్వభావస్య సత్వోపసర్జనం రజః ప్రభవః. వైశ్య స్వభావస్య తమ ఉపసర్జనం రజః ప్రభవః శూద్రస్య భావస్య రజ ఉపసర్జనం తమః ప్రభవః” (శ్రీశంకరః)

(బ్రాహ్మణుని స్వభావమునకు కారణము సత్వగుణము - క్షత్రియుని స్వభావమునకు కారణము సత్వము ఉపసర్జనము రజోగుణము - వైశ్వుని స్వభావమునకు కారణము తమోగుణము - ఉపసర్జనము రజోగుణము - శూద్రుని స్వభావమునకు కారణము రజోపసర్జనము - తమోగుణము).

  1. “బ్రాహ్మణస్య స్వభావ ప్రభవో రజస్తమో (అ)భి భవేన ఉద్భూతః సత్వ గుణః. క్షత్రియస్య స్వభావ ప్రభవః తమస్సత్వాభి భవేనోద్భూతః రజోగుణః - వైశ్యస్య స్వభావ ప్రభవస్సత్వ రజో భి భవేన అల్పోద్రిక్తః తమోగుణః. శూద్రస్య స్వభావ ప్రభవస్తు రజస్సత్త్వాభి భవేన అత్యుద్రిక్తః తమో గుణః” (శ్రీమాన్ రామానుజః)

(బ్రాహ్మణుని స్వభావము వలన కలిగినది, రజోగుణమును తమోగుణమును అణచిపెట్టిన సత్వగుణము - క్షత్రియుని స్వభావమువలన కలిగినది తమోగుణమును సత్వగుణమును అణచిపెట్టి పుట్టినది రజోగుణము. వైశ్యుని స్వభావమువలన కలిగినది సత్వగుణమును రజోగుణమును అణచి ఉంచి కొద్దిగా ఉద్రిక్తమైన తమోగుణము. శూద్రుని స్వభావమువలన కలిగినది రజోగుణమును, సత్వగుణమును అణచిపెట్టి మిక్కిలి ఉద్రిక్తమైన తమోగుణము).

  1. “స్వభావ నియతం కర్మ కుర్వన్నాప్నోతి - కిల్బిషం”. (శ్రీమద్భగవద్గీత - 18 - 47)

(ఎవరి స్వభావమునకు శాస్త్రములో నియమింపబడిన కర్మ వారు చేసిన యడల పాపమును చెందరు)

Transliteration
  1. svabhāvō nāma padārthānāṃ pratiniyatā śaktiḥ, - agnē rauṣṇamiva.

(padārthamulalō kaluguśakti - agniki vēḍimi svabhāvamu, nīṭiki taḍi svabhāvamu, ṟātiki kaṭhinamugā nuṃḍuṭa svabhāvamu - agni vēḍigānuṃḍuṭē kāni callagā nuṃḍanēradu -)

  1. svasvabhāvaḥ svabhāvaḥ

(padārthamuyokka svasvarūpasthiti - agniki vēḍigā nuṃḍuṭa dharmamu - agni vēḍimi, calladanamu anu reṃḍu viruddhadharmamulu kaligiyuṃḍadu - agniki vēḍimiyē asādhāraṇa dharmamu - vēḍigā nuṃḍuṭayē dāni svabhāvamu_.

  1. vahnyē ṣṇavatsa bhāvatvāt svabhāvō durati kramaḥ ||. (gītābhāvaprakāśamu - 2 - 552)

(agniki svabhāvamaina vēḍimivale svabhāvamu anunadi atikramiṃpa śakyamu kānidi - agni dāni dharmamu - svabhāvamu - ayina vēḍimini eppuḍū vadaladu - “svabhāvamu atikramiṃpa śakyamu kānidi” anunadi oka nyāyamu).

  1. vastunaḥ svabhāvikō dharmaḥ - pariṇāma hētuḥ -

(vastuvu yokka svabhāvikamaina dharmamu - vastuvu mārpu ceṃduṭaku kāraṇamainadi).

  1. “svaḥ bhāvaḥ svabhāvaḥ, avidyā lakṣaṇā prakṛtiḥ māyā pravartatē” (śrīśaṃkaraḥ)

(avidya yanu māyā prakṛtiyē satvarajastamamulanu tana triguṇamuladvārā vyavahariṃcunu - adiyē svabhāvamu).

  1. “śruṇu svabhāva śabdēna māyā (a)vidyādi śabditā |

prakṛtiryāsti saivēyaṃ vyavahārē pravartatē ||“. (gītābhāvaprakāśamu - )

(māya, avidya, prakṛti yani ceppabaḍinadē svabhāvamugā vyavahāramulō pravartiṃcucunnadi. anagā idiyē karmalu cēyiṃcucunnadi - vāṭi phalamu nanubhaviṃpa cēyucunnadi).

  1. māyā(a)vidyābhidā śaktiḥ svabhāvakhyā pravartatē | (gītābhāvaprakāśamu - 5 - 119)

(avidya yanu pērugala māyayē svabhāvamani ceppabaḍucunnadi).

  1. “ajñānātmikā daivī māyā prakṛtiḥ” (madhusūdhanīvyākhyā)

(ajñānarūpamai daiva saṃbaṃdhamaina māya yanu prakṛti).

  1. īśvarasya prakṛtiḥ triguṇātmikā -

(satvarajastamamulugala īśvaruni prakṛti)

  1. satvādi guṇatraya rūpaḥ

(satvarajastamamulanu mūḍuguṇamula (heccutaggulatō) kūḍiyuṃḍunadi) “satvādi pravṛttiḥ” (satvarajastamamulanu triguṇamula vyāpāramu).

  1. prakṛtiḥ, anātmabhūtaṃ ātmani saṃbadhyamānaṃ bhūta sūkṣma tadvāsanādikaṃ -

(prakṛti - ātmayaṃdu baṃdhiṃpabaḍina anātmavastuvu sūkṣmabhūtamu, dāni vāsana modalagunavi).

  1. svasva = tanayokka; bhāvaḥ = saṃkalpamu - tanayokka saṃkalpamu. saṃkalpamu lēnidē svabhāvamuṃḍadu. saṃkalpamu anagā nēnu ī pani cēsedanu - ani manasulō kaligina ūha. ī ūha maniṣi tatvamunu baṭṭi kalugunu - aṃducēta adiyē vāni svabhāvamu)

  2. svāsādhāraṇō bhāvaḥ, prācīna vāsanā nimittaḥ, tattadruci viśēṣaṃ, yatra ruciḥ tatra śraddhājāyatē.

(tanayokka asādhāraṇa bhāvamu - (special) - tanaku okkanikē kalugu bhāvamu. gatiṃcina janmalalōni karmalavalana kaligina vāsanalē kāraṇamugā galadi. ā karmala phalitamugā - vāsana rūpamugā - ī janmalō kaligina svabhāvamu - tanaku pratyēkamagu pravartana aṭṭi vāsanalavalana kaligi konni konni prakriyala yaḍala kalugu ruci - iṣṭamu kaligiyuṃḍuṭa. dēniyaṃdu iṣṭamu kaligi yuṃḍina dāniyaṃdē śraddha kalugunu. aṭti śraddha kaligiyuṃḍuṭē svabhāvamu).

  1. “janmāṃtarakṛta dharmādi saṃskāraḥ, maraṇakālē abhivyaktaḥ svabhāvaḥ ucyatē -” (śrīśaṃkaraḥ)

(kriṃdaṭi janmalalō cēsina puṇyamu modalaguvāṭi saṃskāramu - canipōvunapuḍu vyaktamagunadi - kanabaḍunadi - sūcanagā kanabaḍunadi - svabhāvamani ceppabaḍucunnadi).

  1. prakṛti vāsanā - anādikāla pravṛtta pūrva pūrva karma janita dēvādyākāra prakṛti saṃsarga kṛta tattadātmābhimāna janita vāsanā kṛtaṃ. ī dṛśaṃ kartṛtvādikaṃ sarvaṃ svarūpa prayuktaḥ ityarthaḥ.

(mānavuni prakṛtivalana satvarajastamōguṇamulu heccu takkuvalu valana kaligina vāsana anādikālamu nuṃḍi vaccucunna pūrva janmalalō cēsina karma valana kaligina dēvatalu modalagu ākāramulu, vāṭi prakṛti (naijaguṇamu) valana kaligina āyā śarīramulaṃdali abhimānamuvalana kaligina vāsana kāraṇamugā tayārayina svabhāvamu. iṭuvaṃṭi kartṛtvamu modalagunadaṃtayu svarūpa prayuktamu)

  1. sahaja vāsanā rūpaṃ

(tanatōnē puṭṭina pūrvajanmamula vāsana - anu bhavamu valana kaligina tatvamu, svabhāvamu, guṇamu, dharmamu).

  1. “śruṇu prāgjanma saṃskārō dharmā dharmaika gōcaraḥ |

vartamāna bhavē vyaktaḥ sarvatō balavāṃścayaḥ |

prakṛtiḥ sā svakīya yā stasyāḥ sadṛśamēvahi |

sarvōpi guṇa dōṣajñaścēṣṭatē, kimu mūḍha dhīḥ |

tasmā tsarvē anuvartaṃtē prāṇinaḥ prakṛtiṃ svikāṃ |

puruṣārthakṣayē hētubhūtā mapi durityayāṃ |

rājñōvā mama vā tatra nigphrahaḥ kiṃ kariṣyati |

rāgautkaṭyēna duritānni nivārayituṃ kṣamāḥ |

mahā naraka hētutvaṃ jñātyāpi vāsanā balāt |

pravartamānāḥ pāpēṣu madājñāti kramādapi |

na cibhyatīti tātparyaṃ harērnārāyaṇasya ca ||“. (gītābhāvaprakāśamu - 3 - 202 to 207)

(pāpa puṇyamulatō kūḍina kriṃdaṭi janmala saṃskāramu ī vartamāna janmalō (ippuḍu jarugutunna janmalō) vyaktamagunadi, balamu galadi, yēdi kaladō adiyē tanayokka prakṛti. dīni guṇa dōṣamulu telisinavāḍainanu ā prakṛti - naijamu - prakāramu naḍacunu - pravartiṃcunu. mūḍhuni guṟiṃci vēṟē ceppanavasaramu lēdu - aṃducēta samastamaina jīvulu vāri vāri prakṛtini - svabhāvamunu - (adi puruṣārthamula sādhananu kṣīṇiṃpacēsinanu) - anuvartiṃcucunnāru - vāri prakṛti - naijamu - prakāramu pravartiṃcucunnāru. ī viṣayamulō (ājñacēyu) rājugāni, (bhagavaṃtuḍanaina) nēnu gāni ēmiyu cēyalēmu - vāriki vāri prakṛti prakāramu udrēkamu valana kalugu cēṣṭalanu nivāriṃcuṭa śakyamu kādu - aṭṭivāri svabhāvamu goppa narakamunu poṃdiṃcuṭaku kāraṇamainadani telisiyu vāri pūrva janmala kaligina vāsanā balamu valana pāpākarmala cēyuvārai nā ājñanu (śāstra bōdhananu) atikramiṃcinanu vāru bhayamu ceṃdaru - ani tātparyamu).

  1. svakīyō bhāvaḥ svabhāvaḥ brāhmaṇādi janmahētu bhūtaṃ, prācīna karma ityarthaḥ - tatprabhāvāḥ satvādayō guṇāḥ.

(śrīmān rāmānujaḥ)

(tana bhāvamu - brāhmaṇuḍu modalagu janmalaku kāraṇamainadi. idivaraku janmalalō cēsina karma ani arthamu).

  1. janmāṃtara kṛta saṃskāraḥ, prāṇināṃ vartamāna janmani sva kāryābhi mukhatvēna abhivyaktaḥ svabhāvaḥ saḥ prabhavaḥ yēṣāṃ guṇānāṃ tē svabhāva prabhavāḥ guṇāḥ, guṇaprādurbhāvasya niṣkāraṇānupapattē ḥ -

(idivaraku janmalalō kaligina saṃskāramu prastuta janmalō vāṭi kāryamunu cēyuṭaku - karmaphalamunu cūpuṭaku abhimukhamu ayi - siddhamayi - vyaktamainadi - cēṣṭalalō paiki kanabaḍunadi svabhāvamu - ī svabhāvamu ē guṇamulanu kalugacēyunō avi svabhāvaprabhāvamaina guṇamulu - kuṇamulu (satvarajastamōguṇamulu) niṣkāraṇamugā kalugavu - vāṭiki kāraṇamuṃḍavalenu - adiyē svabhāvamu).

  1. svasya hētuḥ iti svabhāvaḥ -

(tanaku kāraṇamainadi, tana pravartanaku kāraṇamainadi svabhāvamu).

  1. sarvabhūtānāṃ pariṇāma hētuḥ -

  2. svayamēva bhavatīti svabhāvaḥ -

(dānaṃtaṭa adē kalugunadi svabhāvamu - okaru ceppinamīdaṭa kalugunadi kādi - naijamu - “hīnuḍavaguṇaṃbu mānalēḍu” -

  1. “svayamēva sarvaṃbhāvayatīti svabhāvaḥ - svaṃ bhāvayatītivā svabhāvaḥ”

(svayamugā sarvamunu bhāviṃpa cēyunadi - iṣṭāniṣṭamulu kalugacēsi tadvārā kaṣṭa sukhamulanu kalugacēyunadi. iṭlu svabhāvamu kaṣṭamulanu anubhaviṃpa cayucuṃḍagā ātma taṭasthamugā nuṃḍunu).

  1. “prakṛtē ranyathā bhāvō na kathaṃ cidbhaviṣyati”.

(dēni svabhāvamukaṃṭe adi maroka rītigā nuṃḍadu - prati vastuvu dāni svabhāvamu nanusariṃciyē yuṃḍunu gāni vēru vidhamugā nuṃḍadu - “puli pillaku ōkacāra ayina nuṃḍunu”, - tēlunaku kuṭṭuṭayē svabhāvamu).

  1. “svabhāvajēna kauṃtēya nibaddhaḥ svēna karmaṇā |

kartuṃ nēcchasi yanmōhāt kariṣyasya vaśōpi tat ” (śrīmadbhagavadgīta - 18 - 60)

(tana svabhāvarūpamagu karmacēta jīvuḍu baddhuḍagucunnāḍu. ē pani nīvu cēyakayuṃḍa talaṃcitivō dānini mōhamucēta, svabhāvamucēta - nī svabhāvamunaku vaśuḍavai - cēyuduvu. nīvu cēyu karmalu nī vaśamulō lēvu, nī svabhāvamuyokka vaśamulō nunnavi. nīku iṣṭamulēni panula nainanu nī svabhāvamuvalana nīvu cēyavalasiyuṃḍunu, cēyuduvu).

  1. “na kartṛtvaṃ na karmāṇi lōkasya sṛjati prabhuḥ |

na karmaphala saṃ yōgaṃ svabhāvastu pravartatē ||“. (śrīmadbhagavadgīta - 5 - 14)

(lōkamunaku - lōkulaku kartṛtvamugāni, karmaphalamula bhōktṛtvamukāni (anubhavamukāni) bhagavaṃtuḍu kaluga cēyuṭalēdu - svabhāvamē vīṭanniṃṭinī kalugacēyucunnadi).

  1. “svasyaiva brahmaṇa ēva aṃśatayā jīvarūpēṇabhavanaṃ svabhāvaḥ”

(parabrahma yokka aṃśayē jīvarūpamugā aguṭa lēka puṭṭuṭa svabhāvamu - parabrahma jīvabhāvamu noṃduṭa, jīvarūpamu noṃduṭa svabhāvamu)

  1. “svākhyō bhāvaḥ svabhāvaḥ iti vutpatyā jīvōvā svabhāvaḥ sarvadā astyēva ēka prakārēṇa iti bhāvaḥ. aṃtaḥkaraṇādi vyāvṛtyarthō bhāva śabdaḥ nahi ēka prakārēṇa sthitiḥ. aṃtaḥkaraṇādēḥ vikāritvāt - sva śabdaḥ īśvara vyāvṛtyarthaḥ ||” (śrī ānaṃdatīrthaḥ)

(‘tanu’ anu bhāvamu - anu vutpatyarthamu prakāramu svabhāvamu anagā tanē - ā bhagavaṃtuḍē, jīvuḍē - jīva rūpamulō nunna bhagavaṃtuḍē - ellapuḍu okē prakāramugā nuṃḍuvāḍu ani arthamu. ‘bhāvamu’ anu māṭa aṃtaḥkaraṇamu modalagu vāṭi vṛttini teliyacēyunadi. aṃtaḥkaraṇamu modalagunavi mārpulu kalavaguṭacēta okē prakāramugā nuṃḍuṭa kādu - ‘sva’ anu māṭa bhagavaṃtuni guṟiṃci ceppunadi - ‘svasvabhāvamu’).

  1. “parisya brahmaṇaḥ pratidēhaṃ pratyagātma bhāvaḥ, svabhāvaḥ. (sō bhāvaḥ = svabhāvaḥ) adhyātmaṃ ucyatē” (śrīśaṃkaraḥ)

(parabrahmaku pratidēhamu pratyagātmabhāvamu, adhyātmamani ceppabaḍunu. adiyē svaḥ bhāvaḥ - svabhāvamu - jīvuḍu - tana yokka - bhāvamē rūpamē).

  1. “jīvasya ayaṃ jaivō aṃtaḥkaraṇādiḥ dēha paryaṃtaḥ padārthaḥ svabhāvaḥ”, svasvabhāvaḥ svabhāvaḥ “iti vyutpatyātē brahma tadviduḥ” iti jīvānāṃ prakṛtatvāt ‘sva’ śabdō jīvavācī (jayatīrthamuniḥ)

(jīvunidaina aṃtaḥkaraṇamu modalainadi dēhamu varaku gala padārthamu - svabhāvamu - sva = brahma yokka bhāvaḥ = bhāvamu anu vyutpatyarthamunu baṭṭi vāru - brahmajñānulu - jīvuḍu brahmamēyani yerigiri - ani ceppuṭavalana sva śabdamu jīvuni guṟiṃci ceppunadiyē).

  1. “va. dēhaṃbunaku dravyaṃbulaina mahābhūtaṃbulunu janma nimittaṃbulaina karmaṃbulunu, garmakṣōbhakaṃbaina kālaṃbunu, gālapariṇāma hētuvaina svabhāvaṃbunu, bhōktayaina jīvuṃḍunu, vāsudēvuṃḍakā neṟuṃgumu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 5 - 84)

  2. “va. ammahanīya tējōnidhi modali yavatāraṃbu sahasra śīrṣādi yuktaṃbayi prakṛti pravartakaṃbagu nādi puruṣa rūpaṃbagu. aṃdu gālasvabhāvaṃbulanu śaktu ludayiṃce”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 6 - 112)

  3. “pariṇāma saṃpādakō guṇa viśēṣaḥ. sa ca svabhāvaḥ kālasya śaktirvā, prakṛtēḥ svabhāvō vā, bhagavataḥ līlā rasānuguṇa svabhāvōvā”.

(mārpulanu kalugacēyu guṇaviśēṣamu - adi svabhāvamu. kālamu yokka śakti, lēka prakṛtiyokka svabhāvamu, lēka, bhagavaṃtuniyokka līlāguṇamuyokka svabhāvamu)

  1. “svabhāvō adhyātma mucyatē” (śrīmadbhagavadgīta - 8 - 3)

“svābhāvaḥ svasva rūpaṃ yatpratya kcaitanya mēvahi |

ucyatē adhyātma śabdēna nēṃdriyagrāma ityayaḥ ||“. (gītābhāvaprakāśamu -)

(tana svarūpamē - jīva śarīramunadhiṣṭiṃci yunna jīvuḍē pratyak caitanyamu, adiyē svabhāvamu, adiyē ādhyātmamu, parabrahmatatvamu - svasvarūpamu - aṃducēta svabhāvamanagā iṃdriyamulukāvu).

  1. “sadṛśaṃ cēṣṭatē svasyāḥ prakṛtē rjñāna vānapi |

prakṛtiṃ yāṃti bhūtāni nigrahaḥ kiṃ kariṣyati ||“. (śrīmadbhagavadgīta - 3 - 33)

(jñāni ayinanu tana svabhāvamu nanusariṃciyē panulu cēyunu - bhūtamulu - prāṇulu - vāṭi vāṭi prakṛtinē poṃducuṃḍunu - (svabhāvamunē poṃducuṃḍunu) - dānini aḍḍuṭakugāni, mārcuṭakugāni evarunu ēmiyunu cēyajālaru).

  1. “anēka taḍavalu oka kāryamunu oka vidhamugā cēsi marala adē vidhamugā cēyucu vaccinaṃduna saṃpādiṃpabaḍina vāḍuka lēka alavāṭu. idē vidhamugā manassunakunu vāḍukalu - alavāṭlu ērpaḍunu - kāryamulanu saṃkalpiṃci vikalpiṃci anēka kōṭlamārlu talaṃpulanu talacinaṃduna ērpaḍina vāḍuka, lēka, alavāṭu. dīninē manōvāsana ani ceppuduru - vāsanā jālamunaku svabhāvamani pēru”.

  2. “appuḍē puṭṭina biḍḍaku evarunu nērpiṃcakanē tana tallipālanu pīlcu śaktinē svabhāvamaṃduru - anēka janmalaṃdu tallipālu pīlci, trāgi abhyāsamainaṃduna kaligina śakti”.

  3. svabhāvamu janmatō kūḍa puṭṭinadi, naśiṃpa cēyuṭaku vīlu kānidi, pūrtiga nirōdhiṃpa jālanidi - “puṭṭukatō puṭṭina buddhi puḍakalatōnē pōvunu” - janmatō puṭṭinadi maraṇamuvaraku uṃḍunu).

  4. “brāhmaṇa kṣatriya viśāṃ śūdrāṇāṃ ca paraṃtapa |

karmāṇi pravibhaktāni svabhāva prabhavairguṇaiḥ ||.” (śrīmadbhagavadgīta - 18 - 41)

(brāhmaṇulaku, kṣatriyulaku vaiśyulaku śūdrulaku vāri vāri svabhāvamu valana kaligina guṇamulanu baṭṭi vāriki karmalu vibhajiṃpabaḍinavi).

  1. “brāhmaṇa svabhāvasya satva guṇaḥ prabhavaḥ kāraṇaṃ. tathā kṣatriya svabhāvasya satvōpasarjanaṃ rajaḥ prabhavaḥ. vaiśya svabhāvasya tama upasarjanaṃ rajaḥ prabhavaḥ śūdrasya bhāvasya raja upasarjanaṃ tamaḥ prabhavaḥ” (śrīśaṃkaraḥ)

(brāhmaṇuni svabhāvamunaku kāraṇamu satvaguṇamu - kṣatriyuni svabhāvamunaku kāraṇamu satvamu upasarjanamu rajōguṇamu - vaiśvuni svabhāvamunaku kāraṇamu tamōguṇamu - upasarjanamu rajōguṇamu - śūdruni svabhāvamunaku kāraṇamu rajōpasarjanamu - tamōguṇamu).

  1. “brāhmaṇasya svabhāva prabhavō rajastamō (a)bhi bhavēna udbhūtaḥ satva guṇaḥ. kṣatriyasya svabhāva prabhavaḥ tamassatvābhi bhavēnōdbhūtaḥ rajōguṇaḥ - vaiśyasya svabhāva prabhavassatva rajō bhi bhavēna alpōdriktaḥ tamōguṇaḥ. śūdrasya svabhāva prabhavastu rajassattvābhi bhavēna atyudriktaḥ tamō guṇaḥ” (śrīmān rāmānujaḥ)

(brāhmaṇuni svabhāvamu valana kaliginadi, rajōguṇamunu tamōguṇamunu aṇacipeṭṭina satvaguṇamu - kṣatriyuni svabhāvamuvalana kaliginadi tamōguṇamunu satvaguṇamunu aṇacipeṭṭi puṭṭinadi rajōguṇamu. vaiśyuni svabhāvamuvalana kaliginadi satvaguṇamunu rajōguṇamunu aṇaci uṃci koddigā udriktamaina tamōguṇamu. śūdruni svabhāvamuvalana kaliginadi rajōguṇamunu, satvaguṇamunu aṇacipeṭṭi mikkili udriktamaina tamōguṇamu).

  1. “svabhāva niyataṃ karma kurvannāpnōti - kilbiṣaṃ”. (śrīmadbhagavadgīta - 18 - 47)

(evari svabhāvamunaku śāstramulō niyamiṃpabaḍina karma vāru cēsina yaḍala pāpamunu ceṃdaru)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.