← Back to స · Booklets 51–60 (digitized file 6)

స్వధర్మః svadharmaḥ

Original — తెలుగు
  1. స్వస్య ధర్మః

(తనయొక్క ధర్మము - తనకు వర్ణాశ్రమములననుసరించి శాస్త్రములో చెప్పబడిన ధర్మము - ఆత్మ సంబంధమైన ధర్మము).

  1. స్వే ధర్మాః స్వధర్మాః, స్వవర్ణాశ్రమ నియత శాస్త్రార్థాః

(తన వర్ణాశ్రమములకు శాస్త్రములో నియమింపబడిన ధర్మములు)

  1. “యం వర్ణాశ్రమం ప్రతివాయో విహితః సతస్య స్వధర్మః”. (మధుసూధనీ వ్యాఖ్యా)

(వర్ణాశ్రమముల గుఱించి శాస్త్రములో విహితమై తనకు సంబంధించిన ధర్మము).

  1. విహితానుష్ఠానం

(శాస్త్రములో విహితమైన అనుష్ఠానము -అనుష్టింపవలసినదని శాస్త్రములో విహితమైన ధర్మము).

  1. స్వస్య అవశ్యానుష్ఠేయో వర్ణాశ్రమధర్మః -

(తాను తప్పకుండా అనుష్టింపవలసిన వర్ణాశ్రమములకు సంబంధించిన ధర్మము)

  1. స్వవర్ణాశ్రమోచిత ధర్మం -

(తన వర్ణాశ్రమములకు ఉచితమైన - తగిన - ధర్మము).

  1. అనభిసంహి త ఫల స్వవర్ణాశ్రమోచిత ధర్మం -

(ఫలమును కాంక్షింపక చేయు తన వర్ణాశ్రమములకు తగిన ధర్మము).

  1. స్వః ధర్మః - ఆత్మ స్వభావికం

(తన ధర్మము - తన విద్యుక్త ధర్మము - తనకు స్వభావమువలన కలుగు ధర్మము - చేయు ధర్మము).

  1. “ప్రకృతి సంసృష్టేన హి పురుషేణ ఇంద్రియ వ్యాపార రూపః కర్మ యోగాత్మకో ధర్మః” (శ్రీమాన్ రామానుజః)

(ప్రకృతిచేత సృష్టింపబడిన పురుషుని యొక్క ఇంద్రియ వ్యాపారరూపమై కర్మయోగమునకు సంబంధించిన ధర్మము).

“స్వే నైవ ఉపాదాతుం యోగ్యో ధర్మః” (శ్రీమాన్ రామానుజః)

  1. “సర్వ వర్ణానాం స్వధర్మానుష్ఠానే పరమ పరిమితం సౌఖ్యం”

అన్ని వర్ణములవారికి వారి వారి ధర్మముల నాచరించుటవలన లోకమునందు అపరిమిత సౌఖ్యము లభించును).

  1. “శ్లో||. యజ్ఞాద్యం వర్ణధర్మోచితమపి నియతం కర్మ కర్మప్రదం స్యా |

న్నత్యాజ్యం కార్యమేత ద్విగుణమపి యతో (అ)కర్మణః కర్మ శస్తం |

జీవన్మర్థ్యః కదాచిత్కర చరణయుతో నైవ తిష్టత్య కర్మా |

తస్మా చ్ఛ్రేయా న్స్వధర్మో యదుపతి గదితశ్చిత్త శుద్ధ్యై తృతీయే ||“.

(వర్ణాశ్రమ విహితము, నియతమునగు కర్మ, యజ్ఞ యాగాదికర్మ సుఖము నిచ్చును. అట్తి నిత్య నైమిత్తిక కర్మ నెన్నడును విడువ కూడదు - ఎందువలననగా - ఆ కర్మ కంటె స్వధర్మమగు నిత్య నైమిత్తిక కర్మ రెట్టింపు ప్రసస్తమైనది. మనుజుడు బ్రతికి యుండగ కరచరణములతో కూడినవాడై యెన్నడును కర్మను చేయనివాడై యుండడు. కాన శ్రేయస్కరమగు స్వదర్మము శ్రీకృష్ణపరమాత్మచే చిత్తశుద్ధి కొఱకు శ్రీమద్భగవద్గీతయందు తృతీయాధ్యాయమునందు చెప్పబడినది).

  1. స్వధర్మమనగా తన ధర్మము - తాను ఎవరిని సూక్ష్మ బుద్ధితో విచారించుచు తానుకాని వస్తువులను “నేతి నేతి” యని త్రోసి వేయుచు మిగిలినదియగు ఆత్మయే తాను అని తెలుసుకొనుట).

  2. “క. తమ తమ ధర్మము తప్పక

సములైనను నమ్మి తిరుగు సభ్యులకును బం

ధము ననుజూచిన విరియును

కమలాప్తుడు వొడమ విరియు ఘనతమము క్రియన్ “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ. భా. - 411)

  1. “స్వధర్మ నిరతుండైన పురుషుండనేక జన్మాంతర సుకృత విశేషముబులం జతుర్ముఖత్వంబు నొంది తదనంతరంబునం బుణ్యాతిరేకంబున నన్నుం బొంది యధికారాంతంబున నేను, దేబతాగణంబులును నవ్యాకృతంబైన యే హరి పదంబునుం బొందుదు మట్టి పదంబు భగవంతుండు దనంతన బొందును”.

  2. తథాచ సర్వ జంతూనాం శోకాద్యాదిష్ట చేతసాం |

స్వధర్మ త్యాగో నింద్యస్స్వ సేవాచస్యా త్స్వభావతః |

స్వధర్మే పి ప్రవృత్తానాం ప్రవృత్తిర్మూఢ చేతసాం |

ఫలాభి సంధి పూర్వైవ సాహంకారా చ జాయతే ||. (గీతాభావ ప్రకాశము - 1 - 24,25)

(శోకము మొదలగువాటిచే ఆవేశింపబడిన సమస్త జంతువులకు - ప్రాణులకు, జీవులకు - స్వధర్మమును విడిచివేయుట పరధర్మము నవలంభించుట వారి వారి స్వభావమువలననే కలుగుచున్నది. మూఢులైనవారు స్వధర్మమునవలంభించినను ఫలమును కోరి చేయుటవలన అది అహంకారముతో కూడినదే యగును - అర్జునుడు శోకమోహములు గలవాడై, స్వధర్మమైన - క్షత్రియ ధర్మమైన - యుద్ధము చేయనని శ్రీకృష్ణభగవానునితో పలికెను. శ్రీకృష్ణుని గీతాజ్ఞాన ప్రబోధవలన శోక మోహములను విడిచి పెట్టినవాడై స్వధర్మమైన యుద్ధము చేసెను).

  1. “యతః స్వధర్మ త్యాగేన చిత్తశుద్ధిర్నజాయతే |

నవా స్వర్గేచ్ఛయా సేవ్యం స్వర్గ హేతు విరోధితః |

స్వధర్మ త్యాగినాం స్వర్గః స్వప్నేప్యత్యంత దుర్లభః |

న వా కీర్తీచ్ఛయా సేవ్యం కర్తేర్నాశ కరం యతః |

తస్మాత్స్వధర్మ వైముఖ్యం వర్జనీయం శుభేప్సుభిః ||“. (గీతాభావప్రకాశము - 2 - 19 to 22)

(స్వధర్మమును విడిచిపెట్టుటవలన చిత్తశుద్ధి కలుగదు - స్వర్గమును పొందుటకు అది సాధనముకాదు. కనుక స్వర్గమును కోరువారు స్వధర్మమును వదలకూడదు - స్వధర్మమును విడిచినవారికి స్వర్గము కలలో కూడమిక్కిలి దుర్లభము - స్వధర్మమును విడుచుట వలన కీర్తి నశించును - అందుచేత కీర్తినికోరువారు స్వధర్మమును విడువకూడదు).

  1. “అధ చేచ్త్వ మిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి |

తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి ||“. (శ్రీమద్భగవద్గీత - 2 - 33)

“యది ధర్మ్యమిమం భీష్మ ద్రోణాది ప్రతియోగికం |

ఆహూతో పి పరైరేవం సంగ్రామం న కరిష్యసి |

భవిష్యసి పరావృత్తో భీతో ధర్మాత్స్వయం తదా |

బహు జన్మార్జితం ధర్మం త్యక్త్వా కీర్తించ శాశ్వతీం |

న నివర్తేత సంగ్రామా దితి శాస్త్ర నిషేధతః |

విహితా చరణ త్యగా త్త్వం హి పాపమవాప్స్యసి ||“. (గీతాభావప్రకాశము - 2 - 392 to 395)

(శత్రువులచేత యుద్ధమునకు పిలువబడినను భీషంఉడు, ద్రోణుడు మొదలగు వారితో యుద్ధము చేయక విరమించిన యడల, క్షత్రియ ధర్మమును విడనాడినవాడవనియును, భయపడినవాడవనియును చెప్పుకొనెదరు - అనేక జన్మములందు ఆర్జించిన ధర్మమును విడిచి శాశ్వతమైన కీర్తిని విడిచి, యుద్ధమునుండి మరలిపోరాదు అను శాస్త్రవిహిత ధర్మమును వదలివేయుటవలన పాపమును పొందెదవు).

  1. శ్రేయాస్స్వధర్మోవిగుణః పరధర్మాత్ స్వనుష్టితాత్ |

స్వధర్మేంధనం శ్రేయః పరధర్మో భయావహః ||. (శ్రీమద్భగవద్గీత - 3 - 35)

(మైవం స్వధర్మోయం వర్ణాశ్రమం ప్రతిబోదితః |

శ్రుత్యా స ఏవ తస్యాస్తి ప్రశస్యతర అమృతేః ||

“స సర్వా గోపసమ్హారమంతరేణ కృతోపిచ |

స్వం ప్రత్యవిహితా ద్ధర్మాత్ సర్వాంగైస్థా తాదపి |

అతః స్థితస్య స్వేధర్మే కించిదం గా ననుష్ఠితే |

అపిస్యాన్మరణం శ్రేయ పరధర్మ స్థ జీవితాత్ |

ఇహ కీర్త్యావహో యస్మాత్ పరలోకే సుఖావహః |

స్వధర్మ స్తత్ర ధీమద్భిః స్థేయం శాస్త్రార్థ వేదిభిః |

పరధర్మస్గ్తు లోకానామ కీర్తికరో యతాం |

పరిత్రానర్థో ఘోర నరకాది ప్రధానతః |

తస్మాత్ రాగాది వదన్య ధర్మో హేయో ముముక్షుభిః ” (గీతాభావప్రకాశము - 2 - 226 to 231)

(ఏ వర్ణమునకు ఏ ఆశ్రమమునకు ఏ ధర్మము శ్రుతిలో (శాస్త్రములో) విహితము అని చెప్పబడినదో ఆ ధర్మము ఆ ఆశ్రమములవారికి ఆ వర్ణములవారికి స్వధర్మము. అదియే ప్రశస్తమైనది. తనకు విధించిన ధర్మము ఎంత బాగుగా ఆచరించిన దానికంటె ప్రశస్తమైనది. అందుచేత స్వధర్మమును ఏ కొన్ని లోపములతో చేసినను మేలు. పర ధర్మము ఆచరించుటకంటె మరణము మేలు (శ్రేయస్కరము). స్వధర్మము ఈ లోకములో కీర్తి నిచ్చును, పరలోకమందు సుఖము నిచ్చును - శాస్త్రముల అర్థమును తెలిసిన విద్వాంసులు (బుద్ధిమంతులు) ఈ కారణమువలన స్వధర్మమందే ఉందురు - పరధర్మము ఈ లోకములో అపకీర్తి కలుగచేయును, పైలోకములో ఘోరనరకములపాలు చేయును. అందుచేత మోక్షము కోరువారు రాగము మొదలగు వాటిని విడిచివేసినట్లు పరధర్మమును విడువవలెను).

Transliteration
  1. svasya dharmaḥ

(tanayokka dharmamu - tanaku varṇāśramamulananusariṃci śāstramulō ceppabaḍina dharmamu - ātma saṃbaṃdhamaina dharmamu).

  1. svē dharmāḥ svadharmāḥ, svavarṇāśrama niyata śāstrārthāḥ

(tana varṇāśramamulaku śāstramulō niyamiṃpabaḍina dharmamulu)

  1. “yaṃ varṇāśramaṃ prativāyō vihitaḥ satasya svadharmaḥ”. (madhusūdhanī vyākhyā)

(varṇāśramamula guṟiṃci śāstramulō vihitamai tanaku saṃbaṃdhiṃcina dharmamu).

  1. vihitānuṣṭhānaṃ

(śāstramulō vihitamaina anuṣṭhānamu -anuṣṭiṃpavalasinadani śāstramulō vihitamaina dharmamu).

  1. svasya avaśyānuṣṭhēyō varṇāśramadharmaḥ -

(tānu tappakuṃḍā anuṣṭiṃpavalasina varṇāśramamulaku saṃbaṃdhiṃcina dharmamu)

  1. svavarṇāśramōcita dharmaṃ -

(tana varṇāśramamulaku ucitamaina - tagina - dharmamu).

  1. anabhisaṃhi ta phala svavarṇāśramōcita dharmaṃ -

(phalamunu kāṃkṣiṃpaka cēyu tana varṇāśramamulaku tagina dharmamu).

  1. svaḥ dharmaḥ - ātma svabhāvikaṃ

(tana dharmamu - tana vidyukta dharmamu - tanaku svabhāvamuvalana kalugu dharmamu - cēyu dharmamu).

  1. “prakṛti saṃsṛṣṭēna hi puruṣēṇa iṃdriya vyāpāra rūpaḥ karma yōgātmakō dharmaḥ” (śrīmān rāmānujaḥ)

(prakṛticēta sṛṣṭiṃpabaḍina puruṣuni yokka iṃdriya vyāpārarūpamai karmayōgamunaku saṃbaṃdhiṃcina dharmamu).

“svē naiva upādātuṃ yōgyō dharmaḥ” (śrīmān rāmānujaḥ)

  1. “sarva varṇānāṃ svadharmānuṣṭhānē parama parimitaṃ saukhyaṃ”

anni varṇamulavāriki vāri vāri dharmamula nācariṃcuṭavalana lōkamunaṃdu aparimita saukhyamu labhiṃcunu).

  1. “ślō||. yajñādyaṃ varṇadharmōcitamapi niyataṃ karma karmapradaṃ syā |

nnatyājyaṃ kāryamēta dviguṇamapi yatō (a)karmaṇaḥ karma śastaṃ |

jīvanmarthyaḥ kadācitkara caraṇayutō naiva tiṣṭatya karmā |

tasmā cchrēyā nsvadharmō yadupati gaditaścitta śuddhyai tṛtīyē ||“.

(varṇāśrama vihitamu, niyatamunagu karma, yajña yāgādikarma sukhamu niccunu. aṭti nitya naimittika karma nennaḍunu viḍuva kūḍadu - eṃduvalananagā - ā karma kaṃṭe svadharmamagu nitya naimittika karma reṭṭiṃpu prasastamainadi. manujuḍu bratiki yuṃḍaga karacaraṇamulatō kūḍinavāḍai yennaḍunu karmanu cēyanivāḍai yuṃḍaḍu. kāna śrēyaskaramagu svadarmamu śrīkṛṣṇaparamātmacē cittaśuddhi koṟaku śrīmadbhagavadgītayaṃdu tṛtīyādhyāyamunaṃdu ceppabaḍinadi).

  1. svadharmamanagā tana dharmamu - tānu evarini sūkṣma buddhitō vicāriṃcucu tānukāni vastuvulanu “nēti nēti” yani trōsi vēyucu migilinadiyagu ātmayē tānu ani telusukonuṭa).

  2. “ka. tama tama dharmamu tappaka

samulainanu nammi tirugu sabhyulakunu baṃ

dhamu nanujūcina viriyunu

kamalāptuḍu voḍama viriyu ghanatamamu kriyan “. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū. bhā. - 411)

  1. “svadharma niratuṃḍaina puruṣuṃḍanēka janmāṃtara sukṛta viśēṣamubulaṃ jaturmukhatvaṃbu noṃdi tadanaṃtaraṃbunaṃ buṇyātirēkaṃbuna nannuṃ boṃdi yadhikārāṃtaṃbuna nēnu, dēbatāgaṇaṃbulunu navyākṛtaṃbaina yē hari padaṃbunuṃ boṃdudu maṭṭi padaṃbu bhagavaṃtuṃḍu danaṃtana boṃdunu”.

  2. tathāca sarva jaṃtūnāṃ śōkādyādiṣṭa cētasāṃ |

svadharma tyāgō niṃdyassva sēvācasyā tsvabhāvataḥ |

svadharmē pi pravṛttānāṃ pravṛttirmūḍha cētasāṃ |

phalābhi saṃdhi pūrvaiva sāhaṃkārā ca jāyatē ||. (gītābhāva prakāśamu - 1 - 24,25)

(śōkamu modalaguvāṭicē āvēśiṃpabaḍina samasta jaṃtuvulaku - prāṇulaku, jīvulaku - svadharmamunu viḍicivēyuṭa paradharmamu navalaṃbhiṃcuṭa vāri vāri svabhāvamuvalananē kalugucunnadi. mūḍhulainavāru svadharmamunavalaṃbhiṃcinanu phalamunu kōri cēyuṭavalana adi ahaṃkāramutō kūḍinadē yagunu - arjunuḍu śōkamōhamulu galavāḍai, svadharmamaina - kṣatriya dharmamaina - yuddhamu cēyanani śrīkṛṣṇabhagavānunitō palikenu. śrīkṛṣṇuni gītājñāna prabōdhavalana śōka mōhamulanu viḍici peṭṭinavāḍai svadharmamaina yuddhamu cēsenu).

  1. “yataḥ svadharma tyāgēna cittaśuddhirnajāyatē |

navā svargēcchayā sēvyaṃ svarga hētu virōdhitaḥ |

svadharma tyāgināṃ svargaḥ svapnēpyatyaṃta durlabhaḥ |

na vā kīrtīcchayā sēvyaṃ kartērnāśa karaṃ yataḥ |

tasmātsvadharma vaimukhyaṃ varjanīyaṃ śubhēpsubhiḥ ||“. (gītābhāvaprakāśamu - 2 - 19 to 22)

(svadharmamunu viḍicipeṭṭuṭavalana cittaśuddhi kalugadu - svargamunu poṃduṭaku adi sādhanamukādu. kanuka svargamunu kōruvāru svadharmamunu vadalakūḍadu - svadharmamunu viḍicinavāriki svargamu kalalō kūḍamikkili durlabhamu - svadharmamunu viḍucuṭa valana kīrti naśiṃcunu - aṃducēta kīrtinikōruvāru svadharmamunu viḍuvakūḍadu).

  1. “adha cēctva mimaṃ dharmyaṃ saṃgrāmaṃ na kariṣyasi |

tataḥ svadharmaṃ kīrtiṃca hitvā pāpamavāpsyasi ||“. (śrīmadbhagavadgīta - 2 - 33)

“yadi dharmyamimaṃ bhīṣma drōṇādi pratiyōgikaṃ |

āhūtō pi parairēvaṃ saṃgrāmaṃ na kariṣyasi |

bhaviṣyasi parāvṛttō bhītō dharmātsvayaṃ tadā |

bahu janmārjitaṃ dharmaṃ tyaktvā kīrtiṃca śāśvatīṃ |

na nivartēta saṃgrāmā diti śāstra niṣēdhataḥ |

vihitā caraṇa tyagā ttvaṃ hi pāpamavāpsyasi ||“. (gītābhāvaprakāśamu - 2 - 392 to 395)

(śatruvulacēta yuddhamunaku piluvabaḍinanu bhīṣaṃuḍu, drōṇuḍu modalagu vāritō yuddhamu cēyaka viramiṃcina yaḍala, kṣatriya dharmamunu viḍanāḍinavāḍavaniyunu, bhayapaḍinavāḍavaniyunu ceppukonedaru - anēka janmamulaṃdu ārjiṃcina dharmamunu viḍici śāśvatamaina kīrtini viḍici, yuddhamunuṃḍi maralipōrādu anu śāstravihita dharmamunu vadalivēyuṭavalana pāpamunu poṃdedavu).

  1. śrēyāssvadharmōviguṇaḥ paradharmāt svanuṣṭitāt |

svadharmēṃdhanaṃ śrēyaḥ paradharmō bhayāvahaḥ ||. (śrīmadbhagavadgīta - 3 - 35)

(maivaṃ svadharmōyaṃ varṇāśramaṃ pratibōditaḥ |

śrutyā sa ēva tasyāsti praśasyatara amṛtēḥ ||

“sa sarvā gōpasamhāramaṃtarēṇa kṛtōpica |

svaṃ pratyavihitā ddharmāt sarvāṃgaisthā tādapi |

ataḥ sthitasya svēdharmē kiṃcidaṃ gā nanuṣṭhitē |

apisyānmaraṇaṃ śrēya paradharma stha jīvitāt |

iha kīrtyāvahō yasmāt paralōkē sukhāvahaḥ |

svadharma statra dhīmadbhiḥ sthēyaṃ śāstrārtha vēdibhiḥ |

paradharmasgtu lōkānāma kīrtikarō yatāṃ |

paritrānarthō ghōra narakādi pradhānataḥ |

tasmāt rāgādi vadanya dharmō hēyō mumukṣubhiḥ ” (gītābhāvaprakāśamu - 2 - 226 to 231)

(ē varṇamunaku ē āśramamunaku ē dharmamu śrutilō (śāstramulō) vihitamu ani ceppabaḍinadō ā dharmamu ā āśramamulavāriki ā varṇamulavāriki svadharmamu. adiyē praśastamainadi. tanaku vidhiṃcina dharmamu eṃta bāgugā ācariṃcina dānikaṃṭe praśastamainadi. aṃducēta svadharmamunu ē konni lōpamulatō cēsinanu mēlu. para dharmamu ācariṃcuṭakaṃṭe maraṇamu mēlu (śrēyaskaramu). svadharmamu ī lōkamulō kīrti niccunu, paralōkamaṃdu sukhamu niccunu - śāstramula arthamunu telisina vidvāṃsulu (buddhimaṃtulu) ī kāraṇamuvalana svadharmamaṃdē uṃduru - paradharmamu ī lōkamulō apakīrti kalugacēyunu, pailōkamulō ghōranarakamulapālu cēyunu. aṃducēta mōkṣamu kōruvāru rāgamu modalagu vāṭini viḍicivēsinaṭlu paradharmamunu viḍuvavalenu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.