← Back to స · Booklets 51–60 (digitized file 6)

స్వగతభేదః svagatabhēdaḥ

Original — తెలుగు
  1. ఒకమనిషికి చేతులు కాళ్ళు మొదలగు అవయవములుండుటవలన తనలోనే ఒక భాగమునకు ఇంకొక భాగమునకు భేదమున్నది. ఒక చెట్టు అంతా ఒకేలాగున నుండక, వేర్లు, మాను, కొమ్మలు, ఆకులు, చిగుళ్ళు, కాయలు, పళ్ళు ఉండుటవలన చెట్టు అంతా ఒకే లాగున నుండక తనలోనే భేదమున్నది. ఇది స్వగత భేదము - సద్రూపుడైన బ్రహ్మకు అవయవములు లేనందున స్వగతభేదము లేదు).

  2. “బ్రహ్మ నిరవయవం”, సచ్చిదానంద యస్తు బ్రహ్మణః స్వరూప లక్షణత్వాత్ అసాధారణ ధర్మాః, నతు అవయవాః - పుష్పాదిగత రూప రస గంధ స్పర్శాది గుణాః, యథా పుష్పాది స్వరూపభూతాః తథా సచ్చిదానంద యః ధర్మాః బ్రహ్మ స్వరూపభూతాః ఏవ, న తతో అతిరిక్తాః తస్మాత్ బ్రహ్మ స్వగత భేద రహితః.

(బ్రహ్మ నిరవయవము - అవయవములు లేనిది. జంతువులు, మనుష్యులు మొదలగువాటివలె అవయవములు లేనిది. సత్ చిత్ ఆనందములు అనునవి బ్రహ్మయొక్కస్వరూప లక్షణములు, అసాధారణ లక్షణములు - అందుచేత అవి అవయవములు కావు. పుష్పమునకు సంబంధించిన రూపము, రసము, గంధము, స్పర్శము మొదలగు గుణములు పుష్ప స్వరూపమే అయినట్లు సత్ చిత్ ఆనందములు మొదలగు ధర్మములు బ్రహ్మ స్వరూపమునకు సంబంధించినవికాని బ్రహ్మ కంటె వేరైనవికావు. అందుచేత బ్రహ్మ స్వగత భేదరహితము).

  1. స్వజాతీయ విజాతీయ స్వగత భేదమేమి లేక - - (త్యాగరాజు).
Transliteration
  1. okamaniṣiki cētulu kāḷḷu modalagu avayavamuluṃḍuṭavalana tanalōnē oka bhāgamunaku iṃkoka bhāgamunaku bhēdamunnadi. oka ceṭṭu aṃtā okēlāguna nuṃḍaka, vērlu, mānu, kommalu, ākulu, ciguḷḷu, kāyalu, paḷḷu uṃḍuṭavalana ceṭṭu aṃtā okē lāguna nuṃḍaka tanalōnē bhēdamunnadi. idi svagata bhēdamu - sadrūpuḍaina brahmaku avayavamulu lēnaṃduna svagatabhēdamu lēdu).

  2. “brahma niravayavaṃ”, saccidānaṃda yastu brahmaṇaḥ svarūpa lakṣaṇatvāt asādhāraṇa dharmāḥ, natu avayavāḥ - puṣpādigata rūpa rasa gaṃdha sparśādi guṇāḥ, yathā puṣpādi svarūpabhūtāḥ tathā saccidānaṃda yaḥ dharmāḥ brahma svarūpabhūtāḥ ēva, na tatō atiriktāḥ tasmāt brahma svagata bhēda rahitaḥ.

(brahma niravayavamu - avayavamulu lēnidi. jaṃtuvulu, manuṣyulu modalaguvāṭivale avayavamulu lēnidi. sat cit ānaṃdamulu anunavi brahmayokkasvarūpa lakṣaṇamulu, asādhāraṇa lakṣaṇamulu - aṃducēta avi avayavamulu kāvu. puṣpamunaku saṃbaṃdhiṃcina rūpamu, rasamu, gaṃdhamu, sparśamu modalagu guṇamulu puṣpa svarūpamē ayinaṭlu sat cit ānaṃdamulu modalagu dharmamulu brahma svarūpamunaku saṃbaṃdhiṃcinavikāni brahma kaṃṭe vērainavikāvu. aṃducēta brahma svagata bhēdarahitamu).

  1. svajātīya vijātīya svagata bhēdamēmi lēka - - (tyāgarāju).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.