ఒకే జాతికి చెందిన రెండు చెట్లలో రెండూ ఒకేలాగ లేవు - ఒకటి మాముడిచెట్టు, రెండవది పనస చెట్టు - ఈ రెండు చెట్లుకు గల భేదమే స్వజాతీయ భేదము. ఈ భేదము పరమాత్మలో లేదు - అది ఎట్లంటే - ఆత్మైవేదమగ్ర ఆసీత్, ఏకమేవ, అద్వితీయం, నాన్యత్ కించిన మిషత్ (ఇప్పుడు అనేక నామ రూపములతో కనబడు వస్తువులుగల ప్రపంచము సృష్టికి ముందు ఒక్క ఆత్మగానే యుండెను - ‘ఏకమే’ వ అనుటవలన ఒకే వస్తువుగా - ఏకముగా నుండెను - అనగా విశేషములు లేక యుండెను. ఆత్మ అద్వితీయమని కూడా చెప్పబడెను - అనగా ఆత్మవంటి రెండవ వస్తువు లేదు - అనగా ఆత్మ తర్వాత ప్రపంచమునకు సృష్టి లయములు చేసినది. అటువంటి శక్తి గల వస్తువుమఱియొకటి లేదు - సృష్టి స్థితి లయములు చేయు ఆత్మ ఒకటేయని దీని వలన స్పష్టమగుచున్నది - తనజాతికి సంబంధించిన వస్తువు - మఱియొకటి లేనందున ఆత్మ స్వజాతీయ బేదము లేనిది అని చెప్పబడుచున్నది.
మనిషి పశువు వేరు వేరు జాతులకు సంబంధించినవారు. అందుచేత అది విజాతీయ భేదము - ఇట్లే ఆత్మవస్తువు మఱొకటి లేకయుండుటయే కాక, ఏ విధమైన ఇతర జాతి వస్తువైనను లేదు - అందుచేత ఆత్మకు విజాతీయ భేదము లేదు. ఏ విధమైన ఇంకొక జాతి వస్తువు లేదు అని చెప్పుటచేత ఉన్నదంతా ఆత్మ ఒక్కటే అనియు, దానిలోనుండి సృష్టి జరిగినది కనుక దానిలోనుండి పుట్టినవస్తువులన్నియు ఆత్మ రూపములే - ఉన్నదంతా ఆత్మయే కాని వేఱొకటి లేదు –
“క. - - -
ఆ - - -
హరిమయముగాని ద్రవ్యము
పరమాణువు లేదు – వంశపావనీ వింటే“. (శీమదాంధ్రమహాభాగవతము - 2 - 1 - 17)
okē jātiki ceṃdina reṃḍu ceṭlalō reṃḍū okēlāga lēvu - okaṭi māmuḍiceṭṭu, reṃḍavadi panasa ceṭṭu - ī reṃḍu ceṭluku gala bhēdamē svajātīya bhēdamu. ī bhēdamu paramātmalō lēdu - adi eṭlaṃṭē - ātmaivēdamagra āsīt, ēkamēva, advitīyaṃ, nānyat kiṃcina miṣat (ippuḍu anēka nāma rūpamulatō kanabaḍu vastuvulugala prapaṃcamu sṛṣṭiki muṃdu okka ātmagānē yuṃḍenu - ‘ēkamē’ va anuṭavalana okē vastuvugā - ēkamugā nuṃḍenu - anagā viśēṣamulu lēka yuṃḍenu. ātma advitīyamani kūḍā ceppabaḍenu - anagā ātmavaṃṭi reṃḍava vastuvu lēdu - anagā ātma tarvāta prapaṃcamunaku sṛṣṭi layamulu cēsinadi. aṭuvaṃṭi śakti gala vastuvumaṟiyokaṭi lēdu - sṛṣṭi sthiti layamulu cēyu ātma okaṭēyani dīni valana spaṣṭamagucunnadi - tanajātiki saṃbaṃdhiṃcina vastuvu - maṟiyokaṭi lēnaṃduna ātma svajātīya bēdamu lēnidi ani ceppabaḍucunnadi.
maniṣi paśuvu vēru vēru jātulaku saṃbaṃdhiṃcinavāru. aṃducēta adi vijātīya bhēdamu - iṭlē ātmavastuvu maṟokaṭi lēkayuṃḍuṭayē kāka, ē vidhamaina itara jāti vastuvainanu lēdu - aṃducēta ātmaku vijātīya bhēdamu lēdu. ē vidhamaina iṃkoka jāti vastuvu lēdu ani ceppuṭacēta unnadaṃtā ātma okkaṭē aniyu, dānilōnuṃḍi sṛṣṭi jariginadi kanuka dānilōnuṃḍi puṭṭinavastuvulanniyu ātma rūpamulē - unnadaṃtā ātmayē kāni vēṟokaṭi lēdu –
“ka. - - -
ā - - -
harimayamugāni dravyamu
paramāṇuvu lēdu – vaṃśapāvanī viṃṭē”. (śīmadāṃdhramahābhāgavatamu - 2 - 1 - 17)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.