తనయొక్క నిజమైన రూపమును తాను తెలుసుకొనుట).
యథా కశ్చిత్ గాంధార దేశే భ్యః చోరైః అన్యత్రారేణ్యే బద్ధనేత్ర ఏవ త్యక్తః, కేన చిన్ముక్త బంధః తదుక్త మార్గ గ్రహణ సమర్థః పండితః స్వయం తర్కకుశలో మేధావీ స్వదేశానేవ ప్రాప్నుయాత్; ఏవ మేవ ఇహ అవిద్యా కామాదిభిః స్వరూపానం దాత్ ప్రచ్యావ్య అస్మి న్నరణ్యే సంసారే క్షిప్తః, కేన చిద్దయా పరవశేన ఆచార్యేణ - “. నాసిత్వం సంసారీ. కింతు తత్వమసి” ఇత్యుపదిష్ట స్వరూపః స్వయః తర్క కుశలశ్చేత్ స్వరూపం జానీయాత్, నాన్యథా ఇతి.
(గాంధార దేశస్తులగు కొందఱు దొంగలు ఒక అడవిలో నొకని కళ్ళు కట్టివేసి వదలివేయగా, ఇంకొకరు కళ్ళు బంధము విప్పివేయగా, తాను తర్కము తెలిసినవాడు, పండితుడు, బుద్ధిమంతుడు అగుటచేత అతను చెప్పిన మార్గమును గ్రహించినవాడై మరల తన దేశమును పొందినట్లు, అవిద్య (అజ్ఞానము), కామము మొదలగువాటివలన స్వరూపానందమునుండి భ్రష్టుడై ఈ సంసారమను మహారణ్యమందు పడినవాడై ఎవరో ఒకానొక దయాపరుడగు గురువుచే - “నీవు సంసారివి కావు, ఆ పరబ్రహ్మవే నీవు” అని తన స్వరూపమును - పరబ్రహ్మమే తాను అను జ్ఞానము నుపదేశింపబడినవాడై తాను తర్క కుశలుడైనచో తన స్వరూపమును ‘తనే పరబ్రహ్మ’ అని తెలుసుకొనును - అను జ్ఞానము కలిగినవాడగును. ఇంకొక విధముగా తన స్వరూపమును తెలుసుకొనలేడు).
tanayokka nijamaina rūpamunu tānu telusukonuṭa).
yathā kaścit gāṃdhāra dēśē bhyaḥ cōraiḥ anyatrārēṇyē baddhanētra ēva tyaktaḥ, kēna cinmukta baṃdhaḥ tadukta mārga grahaṇa samarthaḥ paṃḍitaḥ svayaṃ tarkakuśalō mēdhāvī svadēśānēva prāpnuyāt; ēva mēva iha avidyā kāmādibhiḥ svarūpānaṃ dāt pracyāvya asmi nnaraṇyē saṃsārē kṣiptaḥ, kēna ciddayā paravaśēna ācāryēṇa - “. nāsitvaṃ saṃsārī. kiṃtu tatvamasi” ityupadiṣṭa svarūpaḥ svayaḥ tarka kuśalaścēt svarūpaṃ jānīyāt, nānyathā iti.
(gāṃdhāra dēśastulagu koṃdaṟu doṃgalu oka aḍavilō nokani kaḷḷu kaṭṭivēsi vadalivēyagā, iṃkokaru kaḷḷu baṃdhamu vippivēyagā, tānu tarkamu telisinavāḍu, paṃḍituḍu, buddhimaṃtuḍu aguṭacēta atanu ceppina mārgamunu grahiṃcinavāḍai marala tana dēśamunu poṃdinaṭlu, avidya (ajñānamu), kāmamu modalaguvāṭivalana svarūpānaṃdamunuṃḍi bhraṣṭuḍai ī saṃsāramanu mahāraṇyamaṃdu paḍinavāḍai evarō okānoka dayāparuḍagu guruvucē - “nīvu saṃsārivi kāvu, ā parabrahmavē nīvu” ani tana svarūpamunu - parabrahmamē tānu anu jñānamu nupadēśiṃpabaḍinavāḍai tānu tarka kuśaluḍainacō tana svarūpamunu ‘tanē parabrahma’ ani telusukonunu - anu jñānamu kaliginavāḍagunu. iṃkoka vidhamugā tana svarūpamunu telusukonalēḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.