← Back to స · Booklets 51–60 (digitized file 6)

స్వరూప లక్షణము svarūpa lakṣaṇamu

Original — తెలుగు
  1. “స్వరూపమేవ లక్షణం స్వరూప లక్షణం, యథా సత్యాదికం” (సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ) (తైతిరీయోపనిషత్తు)

(స్వరూపమే లక్షణముగా కలిగియుండుట - సత్యం జ్ఞానం అనంతం అయినది బ్రహ్మ అని చెప్పినట్లు - సత్యజ్ఞానానంతములు బ్రహ్మ లక్షణములు - బ్రహ్మ స్వరూప లక్షణము).

  1. “ఆనందో బ్రహ్మ” ఇతి వ్యజానాత్ - (తైత్తిరీయోపనిషత్ - 0 - 3 - 6)

ఇతి వేదాంత పరిభాషా -

(ఆనందమే బ్రహ్మ అని తైత్తిరీయోపనిషత్తులో చెప్పబడినది)

  1. సచ్చిదనంతాత్మకం ఏకమే వ లక్షణం ఇతి కేచిత్; సత్యాదికం - సత్యాదికం ప్రత్యేక లక్షణ మిత్యన్యే.

(సత్, చిత్, అనంతం ఈ మూడు కలిసి పరబ్రహ్మముకు ఒకే స్వరూపలక్షణమని కొందఱి అభిప్రాయము - సత్యం మొదలగునవి మూడు వేఱు వేఱు లక్షణములని మఱి కొందఱి అభిప్రాయము).

  1. “సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ” అనునది బ్రహ్మకు స్వరూప లక్షణము, జగజ్జన్మాది కారణత్వము తటస్థలక్షణము -

“అస్య ప్రత్యక్షాద్యుపస్థాపి తస్య జగతః జన్మాది (జన్మ ఉత్పత్తిః ఆదిర్యస్య, జన్మస్థితి భంగస్య తత్ జన్మాది). యత్ యస్మాత్ బ్రహ్మణో భవతి, తన్య బ్రహ్మణో జగజ్జన్మాది కారణత్వం తటస్థ లక్షణం, సత్యాదికం (”సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ”) స్వరూప లక్షణం“.

(ప్రత్యక్షాది ప్రమాణముల వలన జగత్తునకు సృష్టి స్థితిలయములు పరబ్రహ్మ వలన కలుగుచున్నవని తెలియుచున్నందున అట్టి జగత్తుల జన్మ స్జ్థితి లయముల కారణత్వము పరబ్రహ్మకు తటస్థ లక్షణము - సత్యాదులు - అనగా, పరబ్రహ్మ “సత్యం జ్ఞానమనంతం” అనుట స్వరూపలక్షణము) (పరబ్రహ్మ అనగా ‘సత్యం జ్ఞానం అనంతం’ అను లక్షణములు గలవాడు. ఇది అతని స్వరూప లక్షణము జగత్తును సృష్టించి, పోషించి, సమ్హరించుటలు అతను అట్లు చేయుటవలన అతనికి తటస్థించిన లక్షణము).

  1. “ప్రకృష్ట ప్రకాశరూపశ్చంద్రః అన్నట్లు నిజంబు నెఱింగించుటయే స్వరూపలక్షణమనంబడును”.

(పరబ్రహ్మ ఎటువంటివాడో దానిని నిజముగా నెఱిగిఉంచుటయే స్వరూప లక్షణము).

  1. ఆత్మనః జీవస్య వ్యవస్థానం బంధమోక్షాతిరిక్త స్వరూపేణ అవస్థానం.

(బంధమునకు మోక్షమునకు అతిరిక్తమైన స్థానమును జీవుడు పొందుటే).

  1. కైవల్యం ప్రాప్య శుద్ధాత్మ స్వరూపేణ అవస్థానం -

(కైవల్యమును - మోక్షమును - పొంది, శుద్ధాత్మస్వరూపముతో - ప్రకృతితో కాని, దాని వికారములతోగాని - కలియక యుండుట).

  1. పశ్య భూతవికారాంస్త్వం భూతమాత్రాన్ యధార్థతః |

తత్ క్షణాత్ బంధ నిర్ముక్తః - స్వరూపస్థో భవిష్యసి ||. (అష్టావక్రగీత - 9 - 7)

(భూత తన్మాత్రలను - సూక్ష్మ భూతములను -, భూత వికారములను యధార్థస్థితిలో చూడుము - వాటి నిజస్థితి చూడుము - ఆ వెంటనే బంధమునుండి విడివడి స్వరూపమున నిల్చియుందువు. భూతములతోను వాటి వికారములతోను ఈ ప్రపంచము నిండియున్నది. అవన్నియు భగవంతుని రూపములే కనుక ఈ యధార్థము తెలియగనే తనయొక్క నిజ స్థితిని - తాను ఎవరో - తానే పరమాత్మయని తెలుసుకొని ఆత్మ రూపములోనే యుండెదవు).

Transliteration
  1. “svarūpamēva lakṣaṇaṃ svarūpa lakṣaṇaṃ, yathā satyādikaṃ” (satyaṃ jñānamanaṃtaṃ brahma) (taitirīyōpaniṣattu)

(svarūpamē lakṣaṇamugā kaligiyuṃḍuṭa - satyaṃ jñānaṃ anaṃtaṃ ayinadi brahma ani ceppinaṭlu - satyajñānānaṃtamulu brahma lakṣaṇamulu - brahma svarūpa lakṣaṇamu).

  1. “ānaṃdō brahma” iti vyajānāt - (taittirīyōpaniṣat - 0 - 3 - 6)

iti vēdāṃta paribhāṣā -

(ānaṃdamē brahma ani taittirīyōpaniṣattulō ceppabaḍinadi)

  1. saccidanaṃtātmakaṃ ēkamē va lakṣaṇaṃ iti kēcit; satyādikaṃ - satyādikaṃ pratyēka lakṣaṇa mityanyē.

(sat, cit, anaṃtaṃ ī mūḍu kalisi parabrahmamuku okē svarūpalakṣaṇamani koṃdaṟi abhiprāyamu - satyaṃ modalagunavi mūḍu vēṟu vēṟu lakṣaṇamulani maṟi koṃdaṟi abhiprāyamu).

  1. “satyaṃ jñāna manaṃtaṃ brahma” anunadi brahmaku svarūpa lakṣaṇamu, jagajjanmādi kāraṇatvamu taṭasthalakṣaṇamu -

“asya pratyakṣādyupasthāpi tasya jagataḥ janmādi (janma utpattiḥ ādiryasya, janmasthiti bhaṃgasya tat janmādi). yat yasmāt brahmaṇō bhavati, tanya brahmaṇō jagajjanmādi kāraṇatvaṃ taṭastha lakṣaṇaṃ, satyādikaṃ (”satyaṃ jñānamanaṃtaṃ brahma”) svarūpa lakṣaṇaṃ”.

(pratyakṣādi pramāṇamula valana jagattunaku sṛṣṭi sthitilayamulu parabrahma valana kalugucunnavani teliyucunnaṃduna aṭṭi jagattula janma sjthiti layamula kāraṇatvamu parabrahmaku taṭastha lakṣaṇamu - satyādulu - anagā, parabrahma “satyaṃ jñānamanaṃtaṃ” anuṭa svarūpalakṣaṇamu) (parabrahma anagā ‘satyaṃ jñānaṃ anaṃtaṃ’ anu lakṣaṇamulu galavāḍu. idi atani svarūpa lakṣaṇamu jagattunu sṛṣṭiṃci, pōṣiṃci, samhariṃcuṭalu atanu aṭlu cēyuṭavalana ataniki taṭasthiṃcina lakṣaṇamu).

  1. “prakṛṣṭa prakāśarūpaścaṃdraḥ annaṭlu nijaṃbu neṟiṃgiṃcuṭayē svarūpalakṣaṇamanaṃbaḍunu”.

(parabrahma eṭuvaṃṭivāḍō dānini nijamugā neṟigiuṃcuṭayē svarūpa lakṣaṇamu).

  1. ātmanaḥ jīvasya vyavasthānaṃ baṃdhamōkṣātirikta svarūpēṇa avasthānaṃ.

(baṃdhamunaku mōkṣamunaku atiriktamaina sthānamunu jīvuḍu poṃduṭē).

  1. kaivalyaṃ prāpya śuddhātma svarūpēṇa avasthānaṃ -

(kaivalyamunu - mōkṣamunu - poṃdi, śuddhātmasvarūpamutō - prakṛtitō kāni, dāni vikāramulatōgāni - kaliyaka yuṃḍuṭa).

  1. paśya bhūtavikārāṃstvaṃ bhūtamātrān yadhārthataḥ |

tat kṣaṇāt baṃdha nirmuktaḥ - svarūpasthō bhaviṣyasi ||. (aṣṭāvakragīta - 9 - 7)

(bhūta tanmātralanu - sūkṣma bhūtamulanu -, bhūta vikāramulanu yadhārthasthitilō cūḍumu - vāṭi nijasthiti cūḍumu - ā veṃṭanē baṃdhamunuṃḍi viḍivaḍi svarūpamuna nilciyuṃduvu. bhūtamulatōnu vāṭi vikāramulatōnu ī prapaṃcamu niṃḍiyunnadi. avanniyu bhagavaṃtuni rūpamulē kanuka ī yadhārthamu teliyaganē tanayokka nija sthitini - tānu evarō - tānē paramātmayani telusukoni ātma rūpamulōnē yuṃḍedavu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.