← Back to స · Booklets 51–60 (digitized file 6)

స్వయం జ్యోతిః svayaṃ jyōtiḥ

Original — తెలుగు
  1. స్వయం ప్రకాశః, యత్స్వాత్మానం అన్యాంశ్చ ప్రకాశయతి తత్ స్వయం జ్యోతిరిత్యుచ్యతే.

(స్వయముగా ప్రకాశించునది, తనను ఇతరులను ప్రకాశింపచేయునది - తెలియ చేయునది - స్వయం జ్యోతి యని చెప్పబడుచున్నది).

  1. ఆదిత్యాది భౌతిక జ్యోతి రనపేక్షతయా, చక్షురాది బాహ్య కరణానపేక్షతయా, అంతఃకరణానపేక్షతయా చ స్వయమేవ ప్రకాశతే ఇతి స్వయంజ్యోతిః -

(సూర్యుడు మొదలగు భౌతిక జ్యోతులను - ప్రకాశరూపములను అపేక్షింపకనే, కండ్లు మొదలగు బాహ్యేంద్రియముల సహాయము అపేక్షింపకనే, అంతఃకరణము నపేక్షింపకనే - ఏ విధమైన ఇతర సహాయము అవసరము లేకనే, స్వయముగానే - తనంతట తానే - ప్రకాశించువాడు).

  1. యద్యపి జ్యోతిశ్శబ్దః ప్రకాశమాత్రే ప్రవర్తతే, తధాపి భగవతః ఏవ పరానపేక్ష్య ప్రకాశత్వాత్ స ఏవ జ్యోతిః ఇత్యర్థః,

(జ్యోతి అను శబ్దమునకు - మాటకు - ప్రకాశమే అని అర్థమైనచో భగవంతుడు ఇతరుల సహాయమవసరము లేకుండగనే ప్రకాశించుట చేత జ్యోతి అని చెప్పబడినది).

  1. “ఆత్మానామ జడస్యాస్య ప్రపంచస్య ప్రకాశకః |

స్వయం జ్యోతిస్సదానందః సత్యస్సంపూర్ణ చిద్ఘనం ||“. (పరాశరపురాణే)

(జడమైన ఈ ప్రపంచమును ప్రకాశింపచేయునది ఆత్మ. అదియే స్వయంజ్యోతి, సదానందము, సత్యమైనది, సంపూర్ణమైనది, చైతన్యఘనము).

  1. “స్వయం ప్రకాశః యత్ స్వాత్మానం అన్యాంశ్చ ప్రకాశయతి తత్స్వయం జ్యోతిరుచ్యతే యధా దీపాదిః తద్వత్ అయమపి స్వయం జ్యోతిః - దీపాదిభ్యో జడేభ్యో వైలక్షణ్య సిద్ధ్యా జ్ఞాన రూపత్వ సిద్ధిః. స్వయంజ్యోతిరిత్యనేన జ్ఞానగుణ కత్వ సిద్ధిః, తేన స్వపరప్రకాశకత్వం ఉచ్యతే - తత్ర దీపాదిః చతురంగుళ పరిమిత చతురంగుళ పరిమితస్తేజోరూప ఏకదేశస్థ స్స్వోప్రథక్ సిద్ధ ధర్మ భూతయా ప్రభయా అన్యాన్ ప్రకాశయతి స్వధర్మ భూత ప్రభా మపేక్ష్యైవ స్వమపి ప్రకాశయతే, తద్వతో ఆత్మాపి స్వధర్మభూత జ్ఞానేన అన్యాన్ ప్రకాశయతి. స్వధర్మ భూత జ్ఞాన నిరపేక్షమేవ స్వయమపి ప్రకాశతే ఇతి హ్యుచ్యతే. ఏతావాంస్తు విశేషః పరాగ్ధామా దీపాదిః స్వాత్మానం అన్యాంశ స్వస్మా ఏవ ప్రకాశయతీతి ప్రకాశోనామ వ్యవహారాను గుణ్యాపాదనం. ఏవంచ ప్రకాశత్వం దీపాదిషు ఆత్మని చ అవిశిష్టం. ప్రత్యగ్ధామత్వం తు ఆత్మన్యేవ అసాధారణం ఇతి జ్ఞాన గుణకం జ్ఞాన స్వరూపం చేతి జడాద్విలక్షణం ఆత్మ స్వరూపం ఇతి ఫలితం”.

(తనను, ఇతరములను ప్రకాశింప చేయునది స్వయంజ్యోతి అని చెప్పబడును, దీపమువలె - దీపము తాను కాంతి కలిగియుండి ఇతర వస్తువులను తనకాంతిలో కనబడునట్లు చేయును. ఆ ప్రకారముగానే ఆత్మ కూడా స్వయంజ్యోతి. దీపము మొదలగు జడపదార్థములకంటె వేఱు లక్షణములు కలదగుటచేత జ్ఞానస్వరూపము గలది అను అర్థము కలుగుచున్నది. అందుచేత స్వయంజ్యోతి అనగా జ్ఞానగుణము గలది యను అర్థము సిద్ధించు చున్నది. ఇందువలన తను ప్రకాశించుచు ఇతరములను ప్రకాశింపచేయునది యను అర్థము సిద్ధించు చున్నది. దీపము మొదలగునవి నాలుగు అంగుళముల పరిమితిగలవై ఒకే స్థలమందున్నదై ఇతరములవలన కలుగని ప్రకాశించు ధర్మము కలదై ప్రకాశించుచున్నది. ఆ ప్రకారముగానే తన ధర్మము అయిన జ్ఞానము ఇతరములను ప్రకాశింప చేయుచున్నది. స్వధర్మ భూతజ్ఞానమును అపేక్షింపకనే ప్రకాశించునది కనుక స్వయం ప్రకాశమని చెప్పబడినది - ప్రకాశించుట తన ధర్మము అనికాదు, తాను ప్రకాశమూర్తి, తేజోమూర్తి, కనుక ఇతరుల సహాయము లేకనే ప్రకాశించు చున్నది యని అర్థము).

  1. దీపము మొదలగినవి వాటికొఱకు, ఇతరులకొఱకు ప్రకాశించుచున్నవి. ప్రత్యగాత్మ తనను, ఇతరములను తనకొఱకే ప్రకాశించుచున్నది. ప్రకాశమనగా వ్యవహారానుగుణ్యాపాదనము. ఇట్లు దీపమునకు ఆత్మకు ప్రకాశించుటలో విశేషము లేదు. కాని, ఆత్మ ప్రత్యగాత్మ అయి యుండుటచేత అది అట్టి అసాధారణ (special) గుణము కలది. అది జ్ఞానగుణము - ఆత్మ చిద్రూపము - జ్ఞానమే రూపముగా గలది - జ్ఞాన స్వరూపము - జడముకన్న వేఱు లక్షణములు కలది యగుటే ఆత్మ లక్షణము).
Transliteration
  1. svayaṃ prakāśaḥ, yatsvātmānaṃ anyāṃśca prakāśayati tat svayaṃ jyōtirityucyatē.

(svayamugā prakāśiṃcunadi, tananu itarulanu prakāśiṃpacēyunadi - teliya cēyunadi - svayaṃ jyōti yani ceppabaḍucunnadi).

  1. ādityādi bhautika jyōti ranapēkṣatayā, cakṣurādi bāhya karaṇānapēkṣatayā, aṃtaḥkaraṇānapēkṣatayā ca svayamēva prakāśatē iti svayaṃjyōtiḥ -

(sūryuḍu modalagu bhautika jyōtulanu - prakāśarūpamulanu apēkṣiṃpakanē, kaṃḍlu modalagu bāhyēṃdriyamula sahāyamu apēkṣiṃpakanē, aṃtaḥkaraṇamu napēkṣiṃpakanē - ē vidhamaina itara sahāyamu avasaramu lēkanē, svayamugānē - tanaṃtaṭa tānē - prakāśiṃcuvāḍu).

  1. yadyapi jyōtiśśabdaḥ prakāśamātrē pravartatē, tadhāpi bhagavataḥ ēva parānapēkṣya prakāśatvāt sa ēva jyōtiḥ ityarthaḥ,

(jyōti anu śabdamunaku - māṭaku - prakāśamē ani arthamainacō bhagavaṃtuḍu itarula sahāyamavasaramu lēkuṃḍaganē prakāśiṃcuṭa cēta jyōti ani ceppabaḍinadi).

  1. “ātmānāma jaḍasyāsya prapaṃcasya prakāśakaḥ |

svayaṃ jyōtissadānaṃdaḥ satyassaṃpūrṇa cidghanaṃ ||“. (parāśarapurāṇē)

(jaḍamaina ī prapaṃcamunu prakāśiṃpacēyunadi ātma. adiyē svayaṃjyōti, sadānaṃdamu, satyamainadi, saṃpūrṇamainadi, caitanyaghanamu).

  1. “svayaṃ prakāśaḥ yat svātmānaṃ anyāṃśca prakāśayati tatsvayaṃ jyōtirucyatē yadhā dīpādiḥ tadvat ayamapi svayaṃ jyōtiḥ - dīpādibhyō jaḍēbhyō vailakṣaṇya siddhyā jñāna rūpatva siddhiḥ. svayaṃjyōtirityanēna jñānaguṇa katva siddhiḥ, tēna svaparaprakāśakatvaṃ ucyatē - tatra dīpādiḥ caturaṃguḷa parimita caturaṃguḷa parimitastējōrūpa ēkadēśastha ssvōprathak siddha dharma bhūtayā prabhayā anyān prakāśayati svadharma bhūta prabhā mapēkṣyaiva svamapi prakāśayatē, tadvatō ātmāpi svadharmabhūta jñānēna anyān prakāśayati. svadharma bhūta jñāna nirapēkṣamēva svayamapi prakāśatē iti hyucyatē. ētāvāṃstu viśēṣaḥ parāgdhāmā dīpādiḥ svātmānaṃ anyāṃśa svasmā ēva prakāśayatīti prakāśōnāma vyavahārānu guṇyāpādanaṃ. ēvaṃca prakāśatvaṃ dīpādiṣu ātmani ca aviśiṣṭaṃ. pratyagdhāmatvaṃ tu ātmanyēva asādhāraṇaṃ iti jñāna guṇakaṃ jñāna svarūpaṃ cēti jaḍādvilakṣaṇaṃ ātma svarūpaṃ iti phalitaṃ”.

(tananu, itaramulanu prakāśiṃpa cēyunadi svayaṃjyōti ani ceppabaḍunu, dīpamuvale - dīpamu tānu kāṃti kaligiyuṃḍi itara vastuvulanu tanakāṃtilō kanabaḍunaṭlu cēyunu. ā prakāramugānē ātma kūḍā svayaṃjyōti. dīpamu modalagu jaḍapadārthamulakaṃṭe vēṟu lakṣaṇamulu kaladaguṭacēta jñānasvarūpamu galadi anu arthamu kalugucunnadi. aṃducēta svayaṃjyōti anagā jñānaguṇamu galadi yanu arthamu siddhiṃcu cunnadi. iṃduvalana tanu prakāśiṃcucu itaramulanu prakāśiṃpacēyunadi yanu arthamu siddhiṃcu cunnadi. dīpamu modalagunavi nālugu aṃguḷamula parimitigalavai okē sthalamaṃdunnadai itaramulavalana kalugani prakāśiṃcu dharmamu kaladai prakāśiṃcucunnadi. ā prakāramugānē tana dharmamu ayina jñānamu itaramulanu prakāśiṃpa cēyucunnadi. svadharma bhūtajñānamunu apēkṣiṃpakanē prakāśiṃcunadi kanuka svayaṃ prakāśamani ceppabaḍinadi - prakāśiṃcuṭa tana dharmamu anikādu, tānu prakāśamūrti, tējōmūrti, kanuka itarula sahāyamu lēkanē prakāśiṃcu cunnadi yani arthamu).

  1. dīpamu modalaginavi vāṭikoṟaku, itarulakoṟaku prakāśiṃcucunnavi. pratyagātma tananu, itaramulanu tanakoṟakē prakāśiṃcucunnadi. prakāśamanagā vyavahārānuguṇyāpādanamu. iṭlu dīpamunaku ātmaku prakāśiṃcuṭalō viśēṣamu lēdu. kāni, ātma pratyagātma ayi yuṃḍuṭacēta adi aṭṭi asādhāraṇa (special) guṇamu kaladi. adi jñānaguṇamu - ātma cidrūpamu - jñānamē rūpamugā galadi - jñāna svarūpamu - jaḍamukanna vēṟu lakṣaṇamulu kaladi yaguṭē ātma lakṣaṇamu).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.